Share News

ఫామ్‌లో లేడని అతడిని జట్టు నుంచి తప్పించొద్దు: అనిల్ కుంబ్లే

ABN , Publish Date - Mar 02 , 2026 | 06:11 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. వెస్టిండీస్‌తో కీలక పోరులోనూ అతడు విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఫామ్‌పై మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఫామ్‌లో లేడని అతడిని జట్టు నుంచి తప్పించొద్దు: అనిల్ కుంబ్లే
Anil Kumble on Abhishek Sharma

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో వెస్టిండీస్‌తో జరిగిన కీలక పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సెమీస్‌కు అర్హత సాధించింది. అయితే ప్రస్తుతం ఆందోళన అంతా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ గురించే! టోర్నీ ఆరంభం నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చడం లేదు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మినహా మిగతా అన్ని మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. గ్రూప్ స్టేజిలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ వరుసగా మూడు సార్లు డకౌట్ అయ్యాడు. టీమిండియా మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో సెమీస్ ఆడనుంది. అయితే అభిషేక్ ఫామ్‌పై మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు.


‘అభిషేక్ శర్మ ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదు. వెస్టిండీస్‌తో మ్యాచ్ గెలిచాం. సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో పోరు ఆసక్తికరంగా ఉండనుంది. వారి జట్టులో విల్ జాక్స్ ఉన్నాడు. అతడు పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నాడు. అతడి బౌలింగ్‌లో ఆడటం కాస్త కష్టమే. అయితే అభిషేక్ ఫామ్‌లో లేనప్పటికీ జట్టు నుంచి తప్పించొద్దు’ అని అనిల్ కుంబ్లే సూచించాడు.


అభి రాణించాలి: డుప్లెసిస్

అభిషేక్ శర్మ ఫామ్‌పై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ కూడా స్పందించాడు. ‘ఇక్కడ మంచి విషయం ఏంటంటే.. ప్రస్తుతం వారు గెలిచారు. జట్టు విజయాలు సాధిస్తున్నప్పుడు.. ఫామ్‌లో లేని వ్యక్తి కూడా టీమ్‌తోనే ఉంటాడు. కానీ పరాజయం పాలైనప్పుడే అందరూ విమర్శిస్తారు. ఆ వ్యక్తి బాధ్యతను తీసుకోవాల్సి వస్తుంది. అయితే అభిషేక్ శర్మ సెమీ ఫైనల్స్‌లో ఫామ్ అందుకుని మంచి ఇన్నింగ్స్ ఆడుతాడని ఆశిస్తున్నాను’ అని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు.


ఇవి కూడా చదవండి:

విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?

అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు

Updated Date - Mar 02 , 2026 | 06:11 PM