Share News

ఐపీఎల్ 2026: యువ క్రికెటర్ల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్న బీసీసీఐ

ABN , Publish Date - Mar 02 , 2026 | 07:32 PM

ఐపీఎల్ 2026కు ముందు యువ క్రికెటర్ల కోసం బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వేదికగా ప్రత్యేక క్యాంపులను నిర్వహించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

ఐపీఎల్ 2026: యువ క్రికెటర్ల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్న బీసీసీఐ
BCCI

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026కు ముందు యువ క్రికెటర్ల కోసం బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వేదికగా ప్రత్యేక క్యాంపులను నిర్వహించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది. సీఓఈ చీఫ్ లక్ష్మణ ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లేతో సంప్రదింపులు జరిపినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. జాతీయ జట్టుకు ఆడే సామర్థ్యం కలిగిన ప్లేయర్లకు ఈ మాజీలతో శిక్షణ ఇప్పించాలని బీసీసీఐ భావిస్తోంది. దేశవాళీ, ఇండియా ఏ, సీనియర్ జట్టులోని పలువురికి అవకాశం కల్పించనుంది.


‘వీవీఎస్ లక్ష్మణ్ ఇప్పటికే తన సహచరులు జహీర్, హర్భజన్, కుంబ్లేలతో చర్చలు జరిపాడు. హర్భజన్ నాలుగు రోజుల్లో ఆఫ్ స్పిన్నర్ల క్యాంప్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాడు. జాతీయ జట్టుకు ఆడాలనుకునే క్రికెటర్లకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నాడు. టెస్టుల్లో భారత్ తరఫున వందకుపైగా మ్యాచులు ఆడిన అనుభవం కలిగిన మాజీ క్రికెటర్లతో ఇలాంటి క్యాంపులను నిర్వహించడం శుభపరిణామం. రానున్న తరాల క్రికెటర్లను మరింత రాటు దేల్చడానికి ఇదో మంచి అవకాశం’ అని బీసీసీఐ పేర్కొంది.


ఆ పదవి కోసం..

సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పేస్ బౌలింగ్ కోచ్ పదవి కోసం భారత మాజీ పేసర్లు వీఆర్‌వీ సింగ్, శ్రీనాథ్ అరవింద్ దరఖాస్తు చేసుకున్నారు. వీరిద్దరికి ఇప్పటికే సీఓఈలో పనిచేసిన అనుభవం ఉంది. బీసీసీఐ నిర్దేశించిన పలు కోర్సులను పూర్తి చేశారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ట్రాయ్ కూలీ నిష్క్రమణతో పేస్ బౌలింగ్ హెడ్ పదవి కూడా ఖాళీ అయింది. కాగా స్పిన్ విభాగానికి సునీల్ జోషి కోచ్‌గా ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?

అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు

Updated Date - Mar 02 , 2026 | 07:42 PM