Share News

ఐపీఎల్ 2026: సీఎస్కే వైస్ కెప్టెన్‌గా సంజు శాంసన్.. టీమిండియా దిగ్గజం ఏమన్నాడంటే!

ABN , Publish Date - Mar 19 , 2026 | 07:21 AM

మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సమరం ప్రారంభం కానుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్.. ట్రేడ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చేరిన సంగతి తెలిసిందే. అయితే అతడు సీఎస్కేకి వైస్ కెప్టెన్ అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఐపీఎల్ 2026: సీఎస్కే వైస్ కెప్టెన్‌గా సంజు శాంసన్.. టీమిండియా దిగ్గజం ఏమన్నాడంటే!
CSK

ఇంటర్నెట్ డెస్క్: మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సమరం ప్రారంభం కానుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్.. ట్రేడ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చేరిన సంగతి తెలిసిందే. సీఎస్కే నుంచి జడేజా రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్లాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సంజు.. సీఎస్కేకి వైస్ కెప్టెన్ అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా స్పందించాడు.


‘చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్‌ను ట్రేడ్ చేసుకోవడం.. సీఎస్కే తీసుకున్న గొప్ప నిర్ణయం. చాలాకాలం పాటు సంజు రాజస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీంతో అతడికి నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉన్నాయి. అద్భుమైన ఫామ్‌లో ఉన్న సంజు.. ఇప్పుడు సీఎస్కే జట్టులో కీలక పాత్ర పోషించనున్నాడు. అయితే చెన్నైకి సంజు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించినా ఆశ్చర్యం లేదు’ అని కుంబ్లే అన్నాడు.


కెప్టెన్‌గా కూడా..

‘గత సీజన్‌లో కెప్టెన్ రుతురాజ్ గ్వైక్వాడ్ తీవ్రంగా గాయపడటంతో ధోనీనే ఆ బాధ్యతలు తీసుకున్నాడు. యువ ప్లేయర్లకు అవకాశం వచ్చే దిశగానే చెన్నై ఫ్రాంచైజీ సాగుతుండటంతో.. ఈ సారి సంజుని కెప్టెన్‌గా చేసే అవకాశం కూడా ఉంది. అలాగే ధోనీ చేస్తోన్న వికెట్ కీపింగ్ బాధ్యతలు.. ఈ సీజన్‌లో సంజు శాంసన్‌కు అప్పగించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదేమైనప్పటికీ సంజు చెన్నైలో చేరడం జట్టుకు కలిసొచ్చే విషయం’ అని అనిల్ కుంబ్లే విశ్లేషించాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్2026: రోహిత్ అభిమానులకు అదిరిపోయే న్యూస్..

బుమ్రా కాంట్రాక్ట్‌పై బీసీసీఐ పునరాలోచన!

Updated Date - Mar 19 , 2026 | 07:27 AM