Share News

ఆర్సీబీ @: 18 వేల కోట్లు!

ABN , Publish Date - Mar 19 , 2026 | 05:27 AM

ఐపీఎల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు అమ్మకం వ్యవహారం తుది దశకు చేరింది. ఈ జట్టు కొనుగోలు రేసులో రెండు సంస్థలు బరిలో...

ఆర్సీబీ @: 18 వేల కోట్లు!

బిడ్‌ దాఖలు చేసిన స్వీడన్‌ సంస్థ?

బెంగళూరు: ఐపీఎల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు అమ్మకం వ్యవహారం తుది దశకు చేరింది. ఈ జట్టు కొనుగోలు రేసులో రెండు సంస్థలు బరిలో నిలిచాయి. అందులో ఒకటి స్వీడన్‌కు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ (ఈక్యూటీ)కాగా.. మణిపాల్‌ ఆసుపత్రికి చెందిన రజనీ పాయ్‌, అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ కోల్‌బెర్గ్‌ క్రావిస్‌ రాబర్ట్స్‌ అండ్‌ కో (కేకేఆర్‌), సింగపూర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ గ్రూపు తేమాసెక్‌తో కూడిన కన్సార్షియం రెండోది. ఈక్యూటీ రూ. 18,486 కోట్లకు బిడ్‌ దాఖలు చేసినట్టు సమాచారం. ఇదే ధరను ప్రస్తుత ఆర్సీబీ యాజమాన్యం ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.. బిడ్‌ దాఖలుకు ఆఖరైన సోమవారంనాటికి మొత్తం ఐదు సంస్థలు ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచాయి.

ఇవి కూడా చదవండి..

జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు

సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..

Updated Date - Mar 19 , 2026 | 05:27 AM