జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు
ABN , Publish Date - Mar 18 , 2026 | 03:07 PM
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో అంతర్జాతీయ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వైఫై కాలింగ్ ఆప్షన్ ద్వారా ఇన్‌కమింగ్ ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పొందే సదుపాయం కల్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో(Reliance Jio) అంతర్జాతీయ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వైఫై కాలింగ్ ఆప్షన్ ద్వారా ఇన్‌కమింగ్ ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పొందే సదుపాయం కల్పిస్తోంది. దీని కోసం ఎలాంటి ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. విదేశాల్లో ఉన్నప్పుడు ఎలాంటి రుసుములూ లేకుండానే బ్యాంకు ఓటీపీలు, బ్యాంకింగ్ అలర్ట్ మెసేజ్లు వంటివి పొందవచ్చని తన నివేదికలో పేర్కొంది జియో.
ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునేందుకు యూజర్లు వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యుండి, తమ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ సదుపాయాన్ని యాక్టివేట్ చేసుకుని ఉంటే సరిపోతుంది. తాజాగా జియో తీసుకున్న నిర్ణయం ముఖ్యమైన సందేశాలు పొందడం కోసం ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరాన్ని తప్పిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. విదేశాల్లో ఉన్నప్పుడు బ్యాంక్ ఓటీపీలు, లావాదేవీలకు సంబంధించిన సమాచారం కావాల్సి ఉంటుంది.
అలానే.. ఏదైనా అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాల్సిన సందర్భంలో వెరిఫికేషన్ సందేశాలు అవసరం అవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో యూజర్లు తమ ఫోన్లలో ఈ సదుపాయం యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే.. దేశీయంగా ఏదైనా రీఛార్జ్ ప్లాన్ తప్పనిసరిగా యాక్టివ్‌లో ఉండాలి. అలాగే.. వైఫై కాలింగ్ సదుపాయానికి మన వినియోగించే స్మార్ట్‌ఫోన్ సపోర్ట్ చేస్తుండాలి. మొత్తంగా ఈ సదుపాయంతో అంతర్జాతీయంగా ప్రయాణించే జియో వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.
ఇవి కూడా చదవండి:
ఇరాన్ కోలుకోవడానికి పదేళ్లు పడుతుంది: ట్రంప్
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడి: ఇద్దరు మృతి, పలువురికి గాయాలు