తగ్గిన వెండి, బంగారం ధరలు
ABN , Publish Date - Mar 18 , 2026 | 10:49 AM
ఇటీవల వరకు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. కిలో వెండి ధర మాత్రం వేల రూపాయిల్లో తగ్గింది.
గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు మంగళవారం ఒక్కసారిగా పెరిగాయి. కానీ బుధవారం మళ్లీ స్వల్పంగా బంగారం, భారీగా వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల10 గ్రాముల బంగారంపై రూ.330 తగ్గింది. (Gold, Silver Rates March 18).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. బుధవారం ఉదయం 10.00 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,57,750 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.330 మేర పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల పసిడి ధర(10 గ్రాములు) నిన్నటితో పోలిస్తే రూ.300 మేర తగ్గి రూ.1,44,600 లకు చేరింది.
హైదరాబాద్ మహానగరంలో కిలో వెండి ధర సైతం రూ.5 వేల వరకు తగ్గింది. కిలో వెండి ప్రస్తుతం రూ.2.75 లక్షలుగా ఉంది. మంగళవారం ఇదే కిలో వెండి ధర రూ.2.80 లక్షలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక్క రోజులోనే రూ. 5 వేలు తగ్గింది.
దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో (24, 22 క్యారెట్ల) బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.
చెన్నై: రూ.1,58,950; రూ.1,45,700
ముంబై: రూ.1,57,750; రూ1,44,600
ఢిల్లీ: రూ.1,58,240; రూ.1,45,060
కోల్‌కతా: రూ.1,57,750; రూ.1,44,600
బెంగళూరు: రూ.1,57,750; రూ.1,44,600
హైదరాబాద్: రూ.1,57,750; రూ.1,44,600
విజయవాడ: రూ.1,57,750; రూ.1,44,600
కేరళ: రూ.1,57,750; రూ.1,44,600
పుణె: రూ.1,57,750; రూ.1,44,600
వడోదరా: రూ.1,58,140; రూ.1,44,960
అహ్మదాబాద్: రూ.1,58,140; రూ.1,44,960
వెండి (కిలో) ధరలు ఇలా..
చెన్నై: రూ.2,75,000
ముంబై: రూ.2,65,000
ఢిల్లీ: రూ.2,65,000
కోల్‌కతా: రూ.2,65,000
బెంగళూరు: రూ.2,65,000
హైదరాబాద్: రూ.2,75,000
విజయవాడ: రూ.2,75,000
కేరళ: రూ.2,75,000
పుణె: రూ.2,65,000
వడోదరా: రూ.2,65,000
అహ్మదాబాద్: రూ.2,65,000