సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..
ABN , Publish Date - Mar 18 , 2026 | 03:47 PM
సోమ, మంగళవారాల్లో భారీ లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం కూడా అదే జోరును ప్రదర్శించాయి. వరుసగా మూడో రోజు కూడా లాభాలతోనే రోజును ముగించాయి. అయితే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (92.63) భారీగా పతనమైంది.
సోమ, మంగళవారాల్లో భారీ లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం కూడా అదే జోరును ప్రదర్శించాయి. వరుసగా మూడో రోజు కూడా లాభాలతోనే రోజును ముగించాయి. అయితే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (92.63) ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరుకుంది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ముడి చమురు ధరలు దాదాపు 40 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో రూపాయి కుంగింది. రూపాయి పతనమైనప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ మాత్రం లాభాల జోరును కొనసాగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (76,070)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 300 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింతగా పెరిగాయి. చివరకు సెన్సెక్స్ 633 పాయింట్ల లాభంతో 76,704 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 196 పాయింట్ల లాభంతో 23,777 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో ఏంజెల్ వన్, ఎన్‌బీసీసీ, కోఫోర్జ్, పేటీఎమ్, కేపీఐటీ టెక్నాలజీస్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). వేదంతా, ఎమ్‌సీఎక్స్ ఇండియా, సోలార్ ఇండస్ట్రీస్, నాల్కో, హిందుస్థాన్ జింక్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 450 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1115 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.63గా ఉంది.
ఇవి కూడా చదవండి..
అక్రమవలసదారులకు అమెరికా ఆఫర్.. దేశం నుంచి వెళ్లిపోతే రూ.2.4 లక్షలు..
మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..