ఢిల్లీకి అందేనా..?
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:33 AM
ఐపీఎల్ టైటిల్‌ను ఒక్కసారైనా ముద్దాడని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. లీగ్‌లో బలమైన ముద్రవేసినా కీలక సమయంలో తడబాటు ఆ జట్టుకు ఆనవాయితీగా మారింది. 2020లో...
తొలి టైటిల్ వేటలో క్యాపిటల్స్
బలంగా మిడిలార్డర్
స్టార్క్, ఎన్‌గిడిపైనే పేస్ భారం
ఐపీఎల్ 9 రోజుల్లో
ఐపీఎల్ టైటిల్‌ను ఒక్కసారైనా ముద్దాడని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. లీగ్‌లో బలమైన ముద్రవేసినా కీలక సమయంలో తడబాటు ఆ జట్టుకు ఆనవాయితీగా మారింది. 2020లో రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఫైనల్‌కు చేరిన ఢిల్లీ.. మళ్లీ ఆస్థాయి ప్రదర్శన కనబర్చలేక పోయింది. కాగా, యాజమాన్యం గత సీజన్‌లో జట్టును ప్రక్షాళన చేసింది. ఈ క్రమంలో పంత్‌ను వదిలేసిన ఢిల్లీ.. టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు బాధ్యతలు అప్పగించింది. లీగ్ ఆరంభంలో జోరు చూపినా.. ఆ తర్వాత వరుస పరాజయాలతో ప్లేఆ్‌ఫ్సకే చేరలేక పోయింది. టాపార్డర్‌లో నిలకడలేక పోవడం, బలహీనమైన బౌలింగ్ కారణంగా ఐదో స్థానానికే పరిమితమైంది. అయితే, మినీ వేలంలో లోపాలను సరిచేసే ప్రయత్నం చేసింది. ఓపెనింగ్, ఫినిషర్లను స్వల్ప ధరకే దక్కించుకొంది. డుప్లెసి, జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌ను వదిలేసిన ఢిల్లీ.. డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పథుం నిస్సంక, పృథ్వీ షాలను కొనుగోలు చేసింది. అన్‌క్యా్‌ప్డ ఆల్‌రౌండర్ ఆకిబ్ నబీని రూ. 8.4 కోట్లకు దక్కించుకోవడం విశేషం. లుంగీ ఎన్‌గిడి, కైల్ జేమిసన్‌లతో బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసింది. ట్రేడింగ్‌లో రాజస్థాన్ నుంచి నితీశ్ రాణాను తీసుకొంది. కేఎల్ రాహుల్ జట్టుకు ప్రధాన బ్యాటర్.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
బలాలు
గతేడాదిటాపార్డర్‌లో అతిగా ప్రయోగాలు చేయడం బెడిసికొట్టింది. ఈ నేపథ్యంలో నిలకడ కోసం బెన్ డకెట్, పృథ్వీ షాలో ఒకరిని ఓపెనర్‌గా బరిలోకి దించే అవకాశం ఉంది. మిడిలార్డర్ మిల్లర్, స్టబ్స్, అశుతోష్ రాణాతో బలంగా ఉంది. మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, నటరాజ్‌లతో బౌలింగ్ బలంగా కనిపిస్తుండగా.. ఆకిబ్ నబీ ఆల్‌రౌండ్ ప్రదర్శన జట్టుకు కీలకం కానుంది.
బలహీనతలు
నిలకడలేమి జట్టుకు పెద్ద దెబ్బ. పేపర్‌పై ఓపెనింగ్ కాంబినేషన్ సూపర్ అన్నట్టుగా ఉన్నా.. వాస్తవంలో ఎవరు కుదురుకుంటారనేది ప్రశ్నార్థకం. డకెట్, పృథ్వీ, నిస్సంక గొప్ప ఫామ్‌లో కూడా లేరు. పేస్ బౌలింగ్ మొత్తం స్టార్క్ లేదా ఎన్‌గిడిపైనే ఆధారపడింది. వీరు విఫలమైతే తిప్పలు తప్పవు. భారీ ధరకు కొనుగోలు చేసిన ఆకిబ్‌పై తప్పకుండా ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. అతడు విఫలమైతే జట్టు సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా విదేశీ ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడడం కూడా నష్టం చేస్తోంది.
అంచనాలు
గత సీజన్‌లో ఢిల్లీ ఏడు మ్యాచ్‌లు గెలిచినా.. దురదృష్టవశాత్తూ ప్లేఆ్‌ఫ్సకు చేరలేక పోయింది. అయితే, ఈసారి సమతుల్యమైన జట్టుతో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో అక్షర్ సేన టైటిల్‌పై గురిపెట్టింది.
జట్టు
బ్యాటర్లు: కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, నిస్సంక, సాహిల్ పరాఖ్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్.
ఆల్‌రౌండర్లు: అక్షర్ పటేల్ (కెప్టెన్), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారి, ఆకిబ్ నబీ, నితీశ్ రాణా.
బౌలర్లు: మిచెల్ స్టార్క్, నటరాజన్, ముకేశ్ కుమార్, దుష్మంత్ చమీర, ఎన్‌గిడి, జేమిసన్, కుల్దీప్ యాదవ్.
ఇవి కూడా చదవండి..
జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు
సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..