ఐపీఎల్2026: రోహిత్ అభిమానులకు అదిరిపోయే న్యూస్..
ABN , Publish Date - Mar 18 , 2026 | 03:23 PM
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గురించి ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. అతడి అభిమానులకు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే గుడ్ న్యూస్ చెప్పాడు. ఏంటంటే...
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL 2026) కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది. ఇది ఇలా ఉంటే.. తాజాగా టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ స్థానం ఏమిటి అనే విషయంపై ఆ జట్టు హెడ్ కోచ్ మహేల జయవర్ధనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో రోహిత్ శర్మను 'ఇంపాక్ట్ ప్లేయర్'గా ఉపయోగించే ఆలోచన లేదని, అతను పూర్తిస్థాయి ఆటగాడిగా గ్రౌండ్లో ఉంటాడని జయవర్ధనే స్పష్టం చేశాడు. ఇటీవలి కాలంలో రోహిత్ టీ20 క్రికెట్ ఆడనందున, అతడిని ఎలా ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారని మీడియా అడగ్గా.. ' రోహిత్ శర్మ బాగా కష్టపడుతున్నాడు. గత వారం రోజులుగా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి చాలా సాధన చేశాడు. శిక్షణా శిబిరం తొలి రోజే మాతో చేరిన అతను నెట్స్‌లో చాలా బాగా ఆడాడు. కొత్త తరం రోహిత్‌లా, మరింత ఫిట్‌గా, ఎంతో నిబద్ధతతో కనిపించాడు. కాబట్టి, అతనే జట్టును నడిపించాలని మేము ఎదురుచూస్తున్నాం' అని తెలిపాడు.
'గతేడాది రోహిత్ శర్మ(Rohit Sharma) చిన్న చిన్న గాయాలతో బాధపడ్డాడు. అందుకే అతడిని మేము ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉపయోగించాము. మైదానంలో ఉన్నా లేకపోయినా అతడి ప్రభావం జట్టుపై కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది సీజన్‌లో మాత్రం రోహిత్‌ను కచ్చితంగా ఎక్కువ సమయం మైదానంలోనే ఉంచుతాం. అయితే జట్టులో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు ఉన్నందున.. మ్యాచ్ పరిస్థితుల బట్టి ఇంపాక్ట్ ప్లేయర్‌ను రోటేట్ చేస్తాం' అని జయవర్ధనే పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
‘సన్‌రైజర్స్’ వివాదం.. రంగంలోకి దిగిన లలిత్ మోదీ!
పాక్ దాడుల గురించి భారత్‌తో చర్చించాలనుకుంటున్నాం: అఫ్గాన్ క్రికెటర్