ఐపీఎల్ 2026: సాయి సుదర్శన్ సెంచరీ.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - Apr 24 , 2026 | 09:25 PM
ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జీటీ.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఆర్సీబీకి 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జీటీ.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఆర్సీబీకి 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్(100; 58 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లు వికెట్లు తీయడానికి తీవ్రంగా శ్రమించారు.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్(32; 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), బట్లర్(25; 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరారు. వాషింగ్టన్ సుందర్(19*; 12 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), జాసన్ హోల్డర్(23*; 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) నాటౌట్‌గా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 1, హేజిల్‌వుడ్ 1, సుయాశ్ శర్మ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: గుజరాత్ టైటాన్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన ఆర్సీబీ
ఆ రెండు జట్లు టాప్‌లో ఉండటానికి వారిద్దరే కారణం: పుజారా