Share News

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్.. జట్టులో చేరనున్న కమిన్స్

ABN , Publish Date - Apr 24 , 2026 | 08:42 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ తిరిగి జట్టులో చేరుతున్నట్లు స్వయంగా ప్రకటించాడు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. శనివారం హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్.. జట్టులో చేరనున్న కమిన్స్
Pat Cummins

ఇంటర్నెట్ డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ తిరిగి జట్టులో చేరుతున్నట్లు స్వయంగా ప్రకటించాడు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. శనివారం హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కమిన్స్ మైదానంలోకి దిగనున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇప్పటికే గెలుపు జోష్‌లో ఉన్న ఎస్ఆర్‌హెచ్‌కు మరింత బలం పెరగనుంది.


సీజన్ ప్రారంభానికి ముందే కమిన్స్ వెన్ను నొప్పి కారణంగా తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో జట్టు పగ్గాలు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అందుకున్నాడు. తాత్కాలిక కెప్టెన్‌గా హైదరాబాద్ జట్టును నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తిరిగి కోలుకుని ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గిన కమిన్స్ తిరిగి బరిలోకి దిగనున్నాడు. ‘ఎంతోకాలంగా ఈ సమయం కోసం ఎదురుచూస్తున్నాను. రేపు మళ్లీ మైదానంలోకి రావడం కోసం ఆసక్తిగా ఉన్నా’ అంటూ కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టి క్యాప్షన్ జత చేశాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎక్స్ హ్యాండిల్ కూడా ‘వస్తున్నాడు’ అని క్యాప్షన్ ఇచ్చి కమిన్స్ రాకను ధ్రువీకరించింది.


బౌలింగ్‌లో ప్రయోగాలు..

కమిన్స్ గైర్హాజరీలో ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ దళం కొత్త ప్రయోగాలు చేసింది. యువ పేసర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ అరంగేట్రంలోనే అదరగొట్టారు. రాజస్థాన్ రాయల్స్‌పై చెరో 4 వికెట్లతో చెలరేగారు. ఇక హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి కమిన్స్ తీసుకుంటాడా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగింట్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే కమిన్స్ రాకతో విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కమిన్స్ స్థానంలో ఇప్పటి వరకు ఆడిన మదుశంక తప్పుకోవాల్సి రావొచ్చు. మొత్తానికి నాయకుడి రాకతో సన్‌రైజర్స్ బలంగా మారి టాప్ ప్లేస్ కోసం పోటీ మరింత ఆసక్తికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: గుజరాత్ టైటాన్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన ఆర్సీబీ

ఆ రెండు జట్లు టాప్‌లో ఉండటానికి వారిద్దరే కారణం: పుజారా

Updated Date - Apr 24 , 2026 | 08:42 PM