చరిత్రను మార్చాలని చూడొద్దు.. బీసీసీఐపై రోహిత్ శర్మ అభిమానుల ఆగ్రహం
ABN , Publish Date - Mar 16 , 2026 | 09:12 AM
బీసీసీఐ నిర్వహించిన ‘నమన్ అవార్డ్స్ 2026’ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అందుకున్నాడు. అయితే గిల్‌కు సంబంధించి ఓ విషయంపై రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ నిర్వహించిన ‘నమన్ అవార్డ్స్ 2026’ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. 2024-25 సీజన్‌లో భారత క్రికెటర్ల అద్భుత ప్రదర్శనలను గానూ బీసీసీఐ ఈ అవార్డులను ప్రదానం చేసింది. భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన క్రికెట్ దిగ్గజాలు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్, మిథాలీ రాజ్‌లకు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అందుకున్నాడు. అయితే గిల్‌కు సంబంధించి ఓ విషయంపై రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ ఈ మాత్రం చూసుకోకుండా ఎలా ఉందంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇంతకీ ఏమైందంటే?
ఈ కార్యక్రమం ప్రసార సమయంలో జరిగిన ఒక చిన్న గ్రాఫిక్స్ పొరపాటు ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్క్రీన్‌పై కనిపించినప్పుడు ఆయన పేరు పక్కన ‘విన్నింగ్ కెప్టెన్- ఛాంపియన్స్ ట్రోఫీ 2025’గా చూపించారు. వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్.. రోహిత్ శర్మ నాయకత్వంలో గెలుచుకున్న విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. బీసీసీఐ గ్రాఫిక్ టీం అలా చేయడంపై సోషల్ మీడియాలో రోహిత్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘చరిత్రను తిరగరాయొద్దు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆ సమయంలో సోషల్ మీడియా ప్రభావం నాపై పడకుండా చేశారు: అభిషేక్ శర్మ
భవిష్యత్తులో టీమిండియా మరిన్ని కప్పులు గెలుస్తుంది: సంజు శాంసన్