Share News

రెడ్ కార్పెట్‌పై ఘనస్వాగతం.. సిగ్గుపడిన టెన్నిస్ దిగ్గజం ఫెదరర్‌

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:39 PM

నూయార్క్ నగరంలో టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్‌కు ఊహించని ఘన స్వాగతం లభించింది. దీంతో అతడు ఓ సాధారణ వ్యక్తిలా సిగ్గుపడ్డాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రెడ్ కార్పెట్‌పై  ఘనస్వాగతం.. సిగ్గుపడిన టెన్నిస్ దిగ్గజం ఫెదరర్‌
Roger Federer

స్పోర్ట్స్ డెస్క్: టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ దశాబ్దాల పాటు లక్షలాది మంది అభిమానుల మధ్య, వారి అరుపులతో మార్మోగిన స్టేడియాల్లో గడిపాడు. అలాంటి టెన్నిస్ దిగ్గజం ప్రస్తుతం న్యూయార్క్ నగర వీధిలో ఒక సాధారణ వ్యక్తిలా పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా అనుకోని అతిథి ఒకరు అకస్మాత్తుగా రెడ్ కార్పెట్‌తో పలికిన ఘన స్వాగతానికి ఫెదరర్ సిగ్గుపడిపోయాడు. ఈ టెన్నిస్ దిగ్గజం ఇచ్చిన క్యూట్ రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


ప్రముఖ వైరల్ కంటెంట్ క్రియేటర్, 'రెడ్ కార్పెట్ మనిషి'గా గుర్తింపు పొందిన ఆండ్రూ వే.. రోజర్ ఫెదరర్ కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. సాధారణంగా ఆండ్రూ వే ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రముఖలకు, సాధారణ వ్యక్తులు వెళ్లే మార్గంలో తన ట్రేడ్‌మార్క్ ఎర్రటి తివాచీని పరిచి వారిని ఆశ్చర్యానికి గురి చేస్తాడు. అంతేకాక వారికి కొద్దిసేపు సెలబ్రిటీ అనుభూతిని పంచడం ఆండ్రూ వే ప్రత్యేకత. ఇందులో భాగంగానే ఫెదరర్‌కు ఎదురుగా వెళ్లి... అకస్మాత్తుగా రెడ్ కార్పెట్ పరిచాడు.


కోట్లాది మంది అభిమానుల ముందు ఎన్నో మ్యాచ్‌లు ఆడిన ఫెదరర్.. ఈ చిన్న సర్‌ప్రైజ్‌కు మాత్రం కాస్త సిగ్గుపడ్డాడు. క్యాజువల్ హుడీ, తెల్లటి స్నీకర్స్ ధరించి చిరునవ్వుతో ఆ తివాచీపై నడుస్తూ అభిమానులకు అభివాదం చేశాడు. చివరగా తనకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆండ్రూ వేతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో అతడి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన ఫెదరర్ 2022లో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లో సెరెనా-అల్కరాజ్ జోడీ ఓటమి

కోహ్లీ, రోహిత్ మాత్రమే కాదు.. ఆ ప్లేయర్లతోనూ గంభీర్‌కు గ్యాప్!

Updated Date - Aug 26 , 2026 | 01:32 PM