యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లో సెరెనా-అల్కరాజ్ జోడీ ఓటమి
ABN , Publish Date - Aug 26 , 2026 | 10:35 AM
యూఎస్ ఓపెన్ 2026 మిక్స్‌డ్ డబుల్స్‌లో సెరెనా-అల్కరాజ్ జోడీకి గట్టి షాక్ తగిలింది. స్విట్జర్లాండ్‌కు చెందిన బెర్నిడా బెన్సిచ్, ఇటలీ ప్లేయర్ ఫ్లావియో కొబోల్లి జోడీ చేతిలో ఓటమి పాలైంది.
స్పోర్ట్స్ డెస్క్: అమెరికా గడ్డపై రికార్డు సృష్టిస్తారనుకున్న టెన్నిస్ దిగ్గజాల 'డ్రీమ్ జోడీ' పోరు క్వార్టర్స్‌లోనే ముగిసింది. యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో అమెరికా టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ జంట ఓటమి పాలైంది. క్వార్టర్ ఫైనల్ పోరులో స్విట్జర్లాండ్‌కు చెందిన బెర్నిడా బెన్సిచ్, ఇటలీ ప్లేయర్ ఫ్లావియో కొబోల్లి జోడీ చేతిలో 5-4, 4-1 తేడాతో ఈ స్టార్ జోడీ పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో బ్రిటన్-న్యూజిలాండ్ జోడీ అయిన లాయిడ్ గ్లాస్‌పూల్, ఎమ్మారౌట్లిఫ్‌లపై సెరెనా-అల్కరాజ్ జోడీ అద్భుత విజయం సాధించి మంచి ఫామ్‌లో కనిపించింది.
అయితే, క్వార్టర్స్‌లో మాత్రం ప్రత్యర్థులైన కొబొల్లి, బెన్సిచ్‌ల జోడీ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ఓపెన్ సింగిల్స్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న కొబోలి, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ బెన్సిచ్‌లు దూకుడుగా ఆడుతూ.. సెరెనా-అల్కరాజ్‌లను కట్టడి చేశారు. 2022లో టెన్నిస్ వీడ్కోలు పలికిన సెరెనా విలియమ్స్, ఆ తర్వాత తిరిగి ఆర్థర్ ఆష్ స్టేడియంలో అడుగుపెట్టడం విశేషం. అలాగే సుదీర్ఘ గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన కార్లోస్ అల్కరాజ్‌తో కలిసి ఆమె ఈ మిక్స్‌డ్ డబుల్స్‌లో బరిలోకి దిగారు. ఈ ఓటమితో బెన్సిచ్, కొబోల్లి జంట బుధవారం జరగనున్న తుది పోరుకు (ఫినాలే) అర్హత సాధించింది. అలానే టెన్నిస్ అభిమానులను అలరించిన సెరెనా-అల్కరాజ్ జోడీ పోరాటం క్వార్టర్స్‌తో ముగిసింది.
ఇవి కూడా చదవండి:
కోహ్లీ, రోహిత్ మాత్రమే కాదు.. ఆ ప్లేయర్లతోనూ గంభీర్‌కు గ్యాప్!
ఫిట్‌గా ఉన్నారు.. క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారా?: సనత్‌తో స్కై