Share News

నాన్నా.. మీ కల నిజం చేయడానికే మైదానంలోకి దిగాను: రింకు సింగ్ ఎమోషనల్ పోస్ట్

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:56 PM

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు కొద్ది రోజుల ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ తండ్రి లివర్ క్యాన్సర్‌తో పోరాడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రింకు సింగ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

నాన్నా.. మీ కల నిజం చేయడానికే మైదానంలోకి దిగాను: రింకు సింగ్ ఎమోషనల్ పోస్ట్
Rinku Singh

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు కొద్ది రోజుల ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ తండ్రి లివర్ క్యాన్సర్‌తో పోరాడి మరణించిన సంగతి తెలిసిందే. పుట్టెడు దు:ఖంలోనూ రింకు తండ్రి అంత్యక్రియలు ముగించుకుని తిరిగి జట్టుతో కలిశాడు. జట్టుకు అవసరం అయినప్పుడల్లా ఫీల్డింగ్‌కు దిగాడు. అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా గెలిచి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో రింకు సింగ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.


‘నాన్న.. మీతో మాట్లాడకుండా రోజు గడిచేది కాదు. మీరు లేకుండా నా జీవితం ఇక ముందు ఎలా ఉంటుందో తెలియడం లేదు. నా ప్రతి అడుగులోనూ మీరు తోడుగా ఉండాలి. విధి నిర్వహణ తర్వాతే ఏదైనా అని మీరు చెబుతుండేవారు. మీ కలను నిజం చేయడానికే నేను మైదానంలోకి దిగాను. మీ కల నెరవేరింది. మీరు ఇప్పుడు నాతోపాటు ఉంటే బాగుండేది. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ఆనందంలోనూ మీరు లేని లోటు తెలుస్తోంది. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. మిస్ యూ నాన్నా’ అంటూ రింకు పోస్ట్‌లో పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ముగిశాకే వన్డే ప్రపంచ కప్ సన్నాహాలు: గౌతమ్ గంభీర్

పశ్చిమాసియాలో యుద్ధం.. శ్రీలంక-అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లు రద్దు

Updated Date - Mar 10 , 2026 | 05:05 PM