Share News

ఐపీఎల్ ముగిశాకే వన్డే ప్రపంచ కప్ సన్నాహాలు: గౌతమ్ గంభీర్

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:04 PM

టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్ దృష్టంతా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ మీదే ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ ముగిశాకే వన్డే ప్రపంచ కప్ సన్నాహాలు: గౌతమ్ గంభీర్
Gautam Gambhir

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. వరుసగా రెండో సారి, ఓవరాల్‌గా ముచ్చటగా మూడోసారి పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీని టీమిండియా ముద్దాడింది. అయితే ఇప్పుడు భారత్ దృష్టంతా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ మీదే ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత వన్డే ప్రపంచ కప్ 2027 సన్నాహాలు ప్రారంభం అవుతాయని తెలిపాడు.


‘వన్డే ప్రపంచ కప్ 2027 కోసం ఐపీఎల్ ముగిసిన తర్వాత సన్నాహాలు ప్రారంభం అవుతాయి. ఐపీఎల్ 2026 నుంచి వన్డే ప్రపంచ కప్ వరకు దాదాపు 25 నుంచి 30 వన్డే మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫార్మాట్లో ఎక్కువగా మ్యాచ్‌లు జరగడం లేదు. ఎంత త్వరగా సన్నాహకాలు ప్రారంభిస్తే.. అంత మంచిది’ అని గంభీర్ అన్నాడు.


అంత తేలిక కాదు..

ఈ వన్డే మెగా టోర్నీ సౌతాఫ్రికా వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. అక్కడి పిచ్‌ల గురించి కూడా అతడు మాట్లాడాడు. ‘దక్షిణాఫ్రికాలో క్రికెట్ ఆడటం అంత తేలిక కాదు. ఆ పరిస్థితులకు తగ్గట్లు ఆడే ఆటగాళ్లను గుర్తించి ఎంపిక చేయాల్సి ఉంటుంది. సెలెక్టర్లు, కోచ్‌లు ఆ పని చూసుకుంటారు. ఐపీఎల్ 2026 ముగిసే సమయానికి వన్డే ప్రపంచ కప్ 2027 కోసం టీమిండియా బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది’ అని గంభీర్ వివరించాడు.


ఇవి కూడా చదవండి:

ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

Updated Date - Mar 10 , 2026 | 03:04 PM