ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:45 PM
టీమిండియా చేసిన అద్భుతాన్ని ప్రతి అభిమాని మనసారా ఆస్వాదిస్తున్నాడు. వరుసగా రెండో సారి, మొత్తంగా ముచ్చటగా మూడోసారి మన భారత జట్టు పొట్టి ప్రపంచ కప్‌ను సగర్వంగా ముద్దాడింది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం అంతా టీ20 ప్రపంచ కప్ మేనియా నడుస్తోంది. టీమిండియా చేసిన అద్భుతాన్ని ప్రతి అభిమాని మనసారా ఆస్వాదిస్తున్నాడు. వరుసగా రెండో సారి, మొత్తంగా ముచ్చటగా మూడోసారి మన భారత జట్టు పొట్టి ప్రపంచ కప్‌ను సగర్వంగా ముద్దాడింది. సూపర్ 8లో సౌతాఫ్రికాపై మినహా.. ప్రతి మ్యాచ్‌లోనూ అజేయంగా నిలిచి ఫైనల్ చేరిన టీమిండియా.. ఆఖరి అంకాన్ని ఘనంగా ముగించింది. న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆయన చేసిన ఆసక్తికరమైన పోస్ట్ కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
‘ఇది కేవలం దేవుడి ప్లాన్ మాత్రమే కాదు. 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్ కూడా. ప్రతి క్రికెటర్ ఇప్పుడు ఓ వరల్డ్ ఛాంపియన్’ అని గౌతీ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. టెస్ట్ మ్యాచుల్లో స్వదేశంలోనే ఓటములు.. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ టోర్నీలో సౌతాఫ్రికాపై పరాజయం తర్వాత గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అతడి అనవసరపు ప్రయోగాల వల్లే జట్టుకు ఓటములు తప్పట్లేవని అతడి ఫ్యాన్సే గౌతీని విమర్శించారు. కానీ ప్రస్తుత విజయంతో విమర్శించిన నోళ్లే ప్రశంసిస్తున్నాయి. గౌతీ పెట్టిన పోస్ట్‌కు ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
సోదరి మృతి.. కన్నీళ్లను ఆపుకుని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్!
ఫైనల్ మ్యాచ్‌లో గొడవ.. అతడిని నేను కావాలని కొట్టలేదు: అర్ష్‌దీప్ సింగ్