మా ఓటమికి అదే ప్రధాన కారణం: శాంట్నర్
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:46 AM
20 ప్రపంచకప్-2026 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా టీమిండియా చేతిలో 96 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ విచారం వ్యక్తం చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: నిన్నటి రోజు భారత క్రికెట్ జట్టుకు అమీతానందాన్ని ఇస్తే... న్యూజిలాండ్‌కు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా టీమిండియా చేతిలో 96 పరుగుల భారీ తేడాతో కివీస్ చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్(Mitchell Santner reaction) విచారం వ్యక్తం చేశాడు. అయితే, తమ జట్టు ఆట పట్ల మాత్రం తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు.
మ్యాచ్ అనంతరం శాంట్నర్ మీడియాతో మాట్లాడుతూ..'ఈ టోర్నీలో(T20 World Cup 2026) మా జట్టు ప్రయాణం ఇక్కడి దాకా సాగినందుకు గర్వంగా ఉంది. మా వాళ్లు గొప్పగా ఆడారు. ప్రతీ దశలోనూ ఎన్నో ఆటంకాలను అధిగమించి ఫైనల్ వరకు వచ్చాము. ఈరోజు కూడా గొప్పగా ఆడిన జట్టు చేతిలోనే ఓడిపోయాము. సొంతగడ్డపై సూర్యకుమార్ సేన అద్భుతం చేసింది. వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది' అని తెలిపాడు.
అదే మా కొంప ముంచింది
'ఈ టోర్నీలో మా జట్టులోని ఒక్కో సభ్యుడు ఒక్కో సందర్భంలో ముందుకు వచ్చి జట్టును గెలిపించాడు. సూపర్-8, సెమీ ఫైనల్లో మేము చాలా చక్కగా ఆడాము. ఫైనల్ మ్యాచ్(New Zealand vs India Final)లో పవర్ ప్లేలో భారత్ ఒక్క వికెట్ కోల్పోకుండా ఏకంగా 90 పరుగుల అసాధారణ స్కోరు నమోదు చేసింది. మేము మాత్రం పవర్‌ప్లేలో దాదాపు 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము. అక్కడే చాలా వెనుకబడి పోయాము. 256 పరుగుల భారీ స్కోరు ఛేదనలో ఇలాంటి పరిస్థితి రావడం అతి పెద్ద సవాలు’ అని శాంట్నర్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ ఆ ఇద్దరికి అంకితం: గౌతమ్ గంభీర్
ఆ సమయంలో సచిన్ చాలా సహాయం చేశారు: సంజూ శాంసన్