ఆ సమయంలో సచిన్ చాలా సహాయం చేశారు: సంజూ శాంసన్
ABN , Publish Date - Mar 09 , 2026 | 08:21 AM
సంజూ శాంసన్.. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టుడైన క్రికెటర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో అత్యంత కీలకమైన మ్యాచ్‌లలో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వరుసగా వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌ల్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు.
సంజూ శాంసన్.. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టుడైన క్రికెటర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో అత్యంత కీలకమైన మ్యాచ్‌లలో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వరుసగా వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌ల్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ టోర్నీలో కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 321 పరుగులు చేశాడు. అంతేకాదు, 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా కూడా నిలిచాడు. తన విజయం వెనుక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడని సంజూ వెల్లడించాడు (Sanju Samson Player of the Tournament).
'దేశం తరఫున ఇలాంటి మెగా టోర్నీలో ఆడాలని కలలు కంటూనే ఉన్నా. అందుకోసం ఎంతో శ్రమించా. ఆ సమయంలో నాకు సచిన్ టెండూల్కర్ గుర్తుకొచ్చారు. ఆయనతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నా. నిన్న కూడా మాట్లాడా. ఆయనే నాకు కాల్ చేశారు. 'ఎలా ఆలోచిస్తున్నావు' అని నన్ను అడిగారు. సచిన్ లాంటి దిగ్గజం నుంచి గైడెన్స్ తీసుకోవడం ఎంతో మేలు చేసింది. గేమ్‌కు ఎలా ప్రిపేర్ కావాలి, మ్యాచ్‌పై అవగాహన మొదలైన విషయాల గురించి సచిన్‌తో మాట్లాడాను' అంటూ సంజూ పేర్కొన్నాడు (Sachin advice to Sanju).
'2024 ప్రపంచకప్ టీమ్‌లో నేనూ సభ్యుడినే. కానీ, నాకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించలేదు (Sanju Samson T20 World Cup). నాకే ఎందుకు ఇలా జరిగిందని బాధపడ్డా. ఈ టోర్నీ కోసం నా సన్నద్ధత రెండేళ్ల కిందటే మొదలైంది. ఇది నాకు ఒక కలలా ఉంది. చాలా సంతోషంగా ఉంది. క్లిష్ట సమయంలో నాకు సహాయంగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు' అని సంజూ అన్నాడు.
ఇవి కూడా చదవండి..
ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు: రిటైర్మెంట్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..
మరింత తగ్గాయ్.. ఈ రోజు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..