ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు: రిటైర్మెంట్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..
ABN , Publish Date - Mar 09 , 2026 | 07:53 AM
భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. అలాగే వన్డేలు, టీ20లు కలిపి చూసుకుంటే భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన ఐదో కెప్టెన్. సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన తొలి టోర్నీలోనే జట్టును విజేతగా నిలిపాడు.
భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. అలాగే వన్డేలు, టీ20లు కలిపి చూసుకుంటే భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన ఐదో కెప్టెన్. సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన తొలి టోర్నీలోనే జట్టును విజేతగా నిలిపాడు. ఈ టోర్నీలో సూర్య పెద్దగా రాణించలేకపోయాడు. ఒక్క అమెరికాతో మ్యాచ్‌లోనే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత సూర్య నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు (Suryakumar Yadav retirement).
పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న సూర్య, టీ20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ వార్తలు వచ్చాయి. ఆదివారం ఫైనల్ మ్యాచ్ అనంతరం కోచ్ గంభీర్‌తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన సూర్య తన రిటైర్మెంట్ గురించి స్పందించాడు. రిటైర్మెంట్ గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. 'ప్రస్తుతం అంతా బాగానే ఉందిగా. ఇప్పుడు దాని గురించి ఆలోచించడం ఎందుకు' అని సమాధానం ఇచ్చాడు (Suryakumar Yadav T20 World Cup).
తన టీమ్‌లోని సభ్యులను సూర్య ప్రశంసలతో ముంచెత్తాడు (Suryakumar Yadav captaincy). 'బుమ్రా లాంటి బౌలర్ జనరేషన్‌కు ఒకసారే వస్తాడు. అతడు మన దేశానికి గొప్ప నిధి. ఎప్పుడు ఎలా బౌలింగ్ చేయాలో అతడికి తెలుసు. ఇక, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ టాప్ క్లాస్ ప్లేయర్స్. మా టీమ్‌లో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇలాంటి జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప అదృష్టం' అని సూర్య అన్నాడు.
ఈ వార్తలూ రాయండి:
ఇదే తన చివరి జర్నీ అంటూ యూట్యూబర్ లైవ్ స్ట్రీమింగ్! చివరకు..
చీరకట్టులో మహిళల సాహనం! చూసి తీరాల్సిన వీడియో