Share News

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:11 PM

టీ20 ప్రపంచ కప్ 2026ని టీమిండియా ముద్దాడటంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిది కీలక పాత్ర. ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి సోషల్ మీడియాలో పెట్టిన ‘టీ కప్’ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అభిమానులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. ఇంతకీ వరుణ్ చేసిన ట్రోల్ ఏమిటంటే..

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్
Varun Chakravarthy

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026ని టీమిండియా ముద్దాడటంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిది కీలక పాత్ర. ఎప్పుడూ సైలెంట్‌గా ఎలాంటి హడావిడి లేకుండా ఉండే వరుణ్.. పాకిస్థాన్‌పై ట్రోల్ చేస్తాడని ఎవరైనా ఊహిస్తారా! ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి సోషల్ మీడియాలో పెట్టిన ‘టీ కప్’ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అభిమానులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. ఇంతకీ వరుణ్ చేసిన ట్రోల్ ఏమిటంటే..


ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా సగర్వంగా ముద్దాడిన విషయం తెలిసిందే. విజయానంతరం వరుణ్ చక్రవర్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోఫీని పట్టుకుని టీ కప్పుతో సిప్ చేస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే తరహా ఫోటోను ఆయన గతంలో కూడా షేర్ చేశాడు. ఆసియా కప్ 2025లో ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా ట్రోఫీ అందుకోకుండానే భారత ఆటగాళ్లు తిరిగి రావాల్సి వచ్చింది. ఆ సమయంలో పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడం భారత జట్టు నిరాకరించింది. దీంతో చక్రవర్తి తన బెడ్‌పై ట్రోఫీ బదులుగా టీ కప్పు పెట్టుకుని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. తరువాత ఒక ఇంటర్వ్యూలో ఆ విషయం గురించి స్పందించాడు. ‘ఆసియా కప్ ఫైనల్ గెలుస్తామనే నమ్మకం ముందే ఉంది. ట్రోఫీతో బెడ్‌పై ఫోటో తీసుకోవాలని ప్లాన్ చేశాను. కానీ ట్రోఫీ లేకపోవడంతో పక్కన ఉన్న కాఫీ కప్పుతోనే ఫోటో తీసుకున్నా’ అని తెలిపాడు.


ఇక ఈ వరల్డ్‌ కప్‌లో వరుణ్ చక్రవర్తి ప్రదర్శన మిశ్రమంగా నిలిచింది. మొత్తం టోర్నీలో 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో ఒకరిగా నిలిచినప్పటికీ.. మొత్తంగా 31 ఓవర్లలో 287 పరుగులు సమర్పించుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

సోదరి మృతి.. కన్నీళ్లను ఆపుకుని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్!

ఫైనల్ మ్యాచ్‌లో గొడవ.. అతడిని నేను కావాలని కొట్టలేదు: అర్ష్‌దీప్ సింగ్

Updated Date - Mar 09 , 2026 | 04:57 PM