పశ్చిమాసియాలో యుద్ధం.. శ్రీలంక-అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లు రద్దు
ABN , Publish Date - Mar 10 , 2026 | 02:26 PM
పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం వల్ల శ్రీలంక-అఫ్గానిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 13 నుంచి 25 వరకు శ్రీలంక-అఫ్గానిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రస్తుతం ఆ సిరీస్ రద్దైంది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం వల్ల శ్రీలంక-అఫ్గానిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 13 నుంచి 25 వరకు శ్రీలంక-అఫ్గానిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రస్తుతం ఆ సిరీస్ రద్దైంది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు సంబంధించి ఓ అధికారి ధ్రువీకరించారు.
‘ఆ ప్రాంతంలో యుద్ధ పరిస్థితుల వల్ల విమానాల రాకపోకలు సరిగా లేవు. దీంతో సిరీస్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది’ అని ఆ అధికారి తెలిపారు. వాస్తవానికి షార్జా వేదికగా మార్చి 13 నుంచి అఫ్గానిస్తాన్, శ్రీలంకల మధ్య మూడు టీ20లు, మార్చి 20, 22, 25 తేదీల్లో మూడు వన్డే మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కానీ అక్కడ ఉద్రిక్తతల కారణంగా ఇప్పుడప్పుడే ఆ సిరీస్ నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో కూడా పలు జట్లు విమాన రాకపోకల్లో అంతరాయం వల్ల స్వదేశాలకు చేరుకోవడంలో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ
పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్