Share News

నేను గత రెండేళ్లు జట్టులోనే లేను.. అభిషేక్ శర్మ ఫామ్‌పై ఇషాన్ కిషన్

ABN , Publish Date - Mar 09 , 2026 | 09:29 PM

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా రెండో సారి పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. జట్టు గెలుపులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలు చేసి కీలక పాత్ర పోషించారు.

నేను గత రెండేళ్లు జట్టులోనే లేను.. అభిషేక్ శర్మ ఫామ్‌పై ఇషాన్ కిషన్
Ishan Kishan

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా రెండో సారి పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. జట్టు గెలుపులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలు చేసి కీలక పాత్ర పోషించారు. ఫీల్డింగ్‌లో ఇషాన్ మెరుపు క్యాచులతో అదరగొట్టాడు. అయితే ట్రోఫీని అందుకున్న తర్వాత ఇషాన్, అభిషేక్ శర్మ సరదాగా మీడియాతో మాట్లాడారు. ఆ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.


మీడియా అభిషేక్ శర్మ ఫామ్ గురించి అడగ్గా.. ‘ఆ ప్రశ్నకు ఇప్పుడు సరైన సమాధానం ఇవ్వగలను’ అని అన్నాడు. ఈలోగా ఇషాన్ కిషన్ మధ్యలో కల్పించుకుని.. ‘ఆ ప్రశ్నకు నేనూ జవాబు ఇస్తా. అరే భాయ్ నువ్వు కేవలం ఒక్క నెల మాత్రమే ఫామ్‌లో లేవు. నేను గత రెండేళ్లు జట్టులోనే లేను’ అని ఇషాన్ అనడంతో అభిషేక్ శర్మ నవ్వేశాడు. దానికి అభిషేక్ స్పందిస్తూ.. ‘అదే నా ఒక్క నెల నీ రెండేళ్లుగా భావించా’ అని బదులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

Updated Date - Mar 09 , 2026 | 09:51 PM