టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్.. అత్యధిక మంది చూసిన మ్యాచ్‌గా ఘనత
ABN , Publish Date - Mar 09 , 2026 | 06:33 PM
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచింది. అయితే భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఈ ఫైనల్ పోరు రికార్డులను కొల్లగొట్టింది. వ్యూస్ పరంగా అత్యధిక మంది చూసిన మ్యాచ్‌గా ఘనత సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 96 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. వరుసగా రెండో సారి, ఓవరాల్‌గా మూడోసారి టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా ముద్దాడింది. అయితే ఈ ఫైనల్ పోరు రికార్డులను కొల్లగొట్టింది. వ్యూస్ పరంగా అత్యధిక మంది చూసిన మ్యాచ్‌గా ఘనత సాధించింది.
82.1 కోట్లమంది ఈ మ్యాచ్‌ను వీక్షించినట్లు జియో హాట్‌స్టార్ వెల్లడించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు పాప్ సింగర్ రికీ మార్టిన్ ప్రదర్శన సమయంలో 2.1 కోట్లుగా ఉన్న వీక్షకులు టాస్ వేసే సమయానికి 4.2 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. న్యూజిలాండ్ చివరి వికెట్ పడే సమయానికి 74.5 కోట్ల మంది మ్యాచ్‌ను వీక్షించగా.. టీమిండియా సెలబ్రేషన్స్ సమయానికి ఆ సంఖ్య 82.1 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. జియో హాట్‌స్టార్‌లో ఓ ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్‌ను ఇంత మంది వీక్షకులు చూడటం ఇదే తొలిసారి. 2023లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను 5.9 కోట్ల మంది వీక్షించారు. ఇక 2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు 5.3 కోట్ల వ్యూస్ వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ
పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్