Share News

వారి నిర్ణయాలు అద్భుతం.. టీమిండియాపై పాక్ దిగ్గజం ప్రశంసలు

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:43 PM

టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా వరుసగా రెండోసారి ముద్దాడింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ భారత క్రికెట్ వ్యవస్థను ప్రత్యేకంగా కొనియాడాడు. రోహిత్, విరాట్ వంటి దిగ్గజాలు లేకుండా యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడంపై ఆయన స్పందించాడు.

వారి నిర్ణయాలు అద్భుతం.. టీమిండియాపై పాక్ దిగ్గజం ప్రశంసలు
Shoaib Akhtar

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2024 విజయం తర్వాత భారత క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ బాధ్యలు చెప్పాడు. అదే సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. కొత్త జట్టు, సరికొత్త విధానాలతో ముందుకెళ్లిన భారత్.. ప్రస్తుతం వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ భారత క్రికెట్ వ్యవస్థను ప్రత్యేకంగా కొనియాడాడు. రోహిత్, విరాట్ వంటి దిగ్గజాలు లేకుండా యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడంపై ఆయన స్పందించాడు.


‘భారత్ విజయానికి ప్రధాన కారణం వారి విధానం, వ్యవస్థ. ముఖ్యంగా టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలు అద్భుతం. బీసీసీఐ క్రికెట్ వ్యవస్థపై భారీగా పెట్టుబడులు పెట్టింది. రంజీ ట్రోఫీ ఆడే యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించింది. గౌతమ్ గంభీర్.. తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా యువ ప్లేయర్లపై నమ్మకం ఉంచాడు. అభిషేక్ శర్మ వంటి ప్లేయర్లు ఎంతో పరిపక్వత చూపించారు. వారు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. అలాగే సంజు శాంసన్‌పై గంభీర్ పెట్టిన నమ్మకం జట్టుకు ఎంతో మేలు చేసింది.


రో-కో లేకుండానే..

కోహ్లీ, రోహిత్‌ శర్మ 2024 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కొత్త జట్టును నిర్మించేందుకు భారత జట్టు ముందుకు సాగిందని అక్తర్ వ్యాఖ్యానించాడు. ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు లేకుండానే భారత్ బరిలోకి దిగింది. ఆ నిర్ణయం సరైందని ఇప్పుడు ఫలితాలే చెబుతున్నాయి. ప్రతిభ ఆధారంగా అవకాశాలు ఇస్తే విజయాలు వస్తాయని భారత్ నిరూపించింది. యువ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. మరో ప్రపంచ కప్‌ను కూడా టీమిండియానే గెలుస్తుంది. డగౌట్‌లో రోహిత్ శర్మ, ధోనీ నిలబడటం చూస్తే చాలా ఆనందంగా అనిపించింది’ అని అక్తర్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

సోదరి మృతి.. కన్నీళ్లను ఆపుకుని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్!

ఫైనల్ మ్యాచ్‌లో గొడవ.. అతడిని నేను కావాలని కొట్టలేదు: అర్ష్‌దీప్ సింగ్

Updated Date - Mar 09 , 2026 | 04:55 PM