Share News

ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ అలవోక విజయం

ABN , Publish Date - Apr 27 , 2026 | 10:06 PM

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో అద్భుత విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘనంగా గెలిచేసింది. 76 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది.

ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ అలవోక విజయం
RCB vs DC

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో అద్భుత విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘనంగా గెలిచేసింది. 76 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(23*; 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్) విన్నింగ్ షాట్లు కొట్టి జట్టును గెలిపించాడు. మరో ఎండ్‌లో దేవదత్ పడిక్కల్(34; 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి ఆడాడు. ఓపెనర్ బెథెల్(20) జెమీసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.


అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్..16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోరు. సాహిల్ పరాఖ్(0), కేఎల్ రాహుల్(1), నితీశ్ రాణా(1), సమీర్ రిజ్వి(0), స్టబ్స్(5), అక్షర్ పటేల్(0), కుల్దీప్ యాదవ్(3).. ఎవ్వరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. డేవిడ్ మిల్లర్(19), జెమీసన్(12) పరుగులు చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభిషేక్ పొరెల్(30; 33 బంతుల్లో 3 ఫోర్లు) కాస్త పోరాడాడు. హేజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ కుమార్ 3, రసిక్ సలామ్ 1, సుయాశ్ శర్మ 1, కృనాల్ పాండ్య 1 వికెట్ పడగొట్టారు.


విరాట్@ 9వేల పరుగులు

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 9000 పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.


ఇవి కూడా చదవండి:

అతడిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలి.. వైభవ్‌పై పాక్ క్రికెట్ అనలిస్ట్ ప్రశంసలు

మూడేళ్ల నాటి సెహ్వాగ్‌ సవాల్‌.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చిన రింకు సింగ్!

Updated Date - Apr 27 , 2026 | 10:06 PM