Share News

ఐపీఎల్ 2026: ఆర్సీబీ బౌలర్ల విజృంభణ.. 75 పరుగులకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆలౌట్

ABN , Publish Date - Apr 27 , 2026 | 09:22 PM

ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. సొంతగడ్డపై తేలిపోయింది. ఆర్సీబీ బౌలర్ల విజృంభణకు 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌట్ అయింది.

ఐపీఎల్ 2026: ఆర్సీబీ బౌలర్ల విజృంభణ.. 75 పరుగులకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆలౌట్
RCB vs DC

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. సొంతగడ్డపై తేలిపోయింది. ఆర్సీబీ బౌలర్ల విజృంభణకు 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోరు. ఆర్సీబీ విజయ లక్ష్యం 76 పరుగులు. తొలి బంతి నుంచే ఆర్సీబీ బౌలర్లు చెలరేగారు. 2 పరుగుల వద్ద 3 వికెట్లు.. 9 పరుగుల వద్ద ఆరు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. హేజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించారు.


సాహిల్ పరాఖ్(0), కేఎల్ రాహుల్(1), నితీశ్ రాణా(1), సమీర్ రిజ్వి(0), స్టబ్స్(5), అక్షర్ పటేల్(0), కుల్దీప్ యాదవ్(3).. ఎవ్వరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. డేవిడ్ మిల్లర్(19), జెమీసన్(12) పరుగులు చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభిషేక్ పొరెల్(30; 33 బంతుల్లో 3 ఫోర్లు) కాస్త పోరాడాడు. ఈ మ్యాచ్‌తో ఢిల్లీ పలు చెత్త రికార్డులు మూట గట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యంత తక్కువ స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. హేజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ కుమార్ 3, రసిక్ సలామ్ 1, సుయాశ్ శర్మ 1, కృనాల్ పాండ్య 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

అతడిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలి.. వైభవ్‌పై పాక్ క్రికెట్ అనలిస్ట్ ప్రశంసలు

మూడేళ్ల నాటి సెహ్వాగ్‌ సవాల్‌.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చిన రింకు సింగ్!

Updated Date - Apr 27 , 2026 | 09:25 PM