ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన ఆర్సీబీ
ABN , Publish Date - Apr 27 , 2026 | 07:15 PM
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ నెగ్గిన ఆర్సీబీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‌కు దిగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ నెగ్గిన ఆర్సీబీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‌కు దిగనుంది. గత మ్యాచ్‌లో ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై ఢిల్లీ విజయం సాధించిన విషయం తెలిసిందే. నేటి మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. పంజాబ్ కింగ్స్‌పై ఓటమిని చవి చూసిన ఢిల్లీ.. ఆర్సీబీపై గెలవాలనే కసితో ఉంది. కాగా ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో ఆర్సీబీ రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఏడింట్లో మూడు గెలిచిన ఢిల్లీ ఏడో స్థానంలో కొనసాగుతోంది.
ఆర్సీబీ తుది జట్టు
రజత్ పాటీదార్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, రసిక్ సలామ్ దార్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: జాకబ్ బెథెల్, కాక్స్, మంగేశ్ యాదవ్, విక్కీ, వెంకటేశ్ అయ్యర్
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
అక్షర్ పటేల్(కెప్టెన్), సాహిల్ పరాఖ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), నితీశ్ రాణా, సమీర్ రిజ్వి, స్టబ్స్, డేవిడ్ మిల్లర్, చమీరా, జెమీసన్, కుల్‌దీప్ యాదవ్, నటరాజన్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ఆకిబ్ నబీ దార్, అశుతోశ్ శర్మ, విప్రజ్ నిగమ్, త్రిపురణ విజయ్, అభిషేక్ పొరెల్
ఇవి కూడా చదవండి:
అతడిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలి.. వైభవ్‌పై పాక్ క్రికెట్ అనలిస్ట్ ప్రశంసలు
మూడేళ్ల నాటి సెహ్వాగ్ సవాల్.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చిన రింకు సింగ్!