Share News

ఐపీఎల్ 2026: ఎంఐకు బిగ్ షాక్.. టోర్నీ మొత్తానికి దూరమైన మిచెల్ శాంట్నర్

ABN , Publish Date - Apr 27 , 2026 | 08:46 PM

ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఎంఐ ఫ్రాంఛైజీ ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ధ్రువీకరించింది.

ఐపీఎల్ 2026: ఎంఐకు బిగ్ షాక్.. టోర్నీ మొత్తానికి దూరమైన మిచెల్ శాంట్నర్
Mitchell Santner

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఎంఐ ఫ్రాంఛైజీ ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ధ్రువీకరించింది. అతడి స్థానంలో సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ కేశవ్ మహరాజ్‌ను తీసుకున్నట్లు వెల్లడించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శాంట్నర్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే.


సీఎస్కే ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్‌ను ఎంఐ పేసర్ బుమ్రా వేశాడు. సీఎస్కే బ్యాటర్ కార్తిక్ శర్మ భారీ షాట్‌కు యత్నించాడు. బౌండరీ లైన్‌కు చాలా ముందుగానే మిచెల్ శాంట్నర్ ఆ బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు. అయితే ఆ సమయంలో అతడి భుజానికి తీవ్ర గాయం అయింది. తల, మెడ మైదానానికి బలంగా తాకడంతో శాంట్నర్ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కూడా చేయలేకపోయాడు. అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ముంబై బరిలోకి దింపింది. అయితే అతడికి కంకషన్ తీసుకోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిపై ముంబై ప్రధాన కోచ్ కూడా స్పందించి వివరణ ఇచ్చాడు. కాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో శాంట్నర్ టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే గాయం కారణంగా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ గత నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఏడు మ్యాచ్‌లు ఆడి రెండింట్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.


ఇవి కూడా చదవండి:

అతడిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలి.. వైభవ్‌పై పాక్ క్రికెట్ అనలిస్ట్ ప్రశంసలు

మూడేళ్ల నాటి సెహ్వాగ్‌ సవాల్‌.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చిన రింకు సింగ్!

Updated Date - Apr 27 , 2026 | 09:13 PM