Share News

ఐపీఎల్ 2026: లఖ్‌నవూతో కీలక పోరు.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్

ABN , Publish Date - May 23 , 2026 | 07:13 PM

ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన పంజాబ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎల్ఎస్‌జీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

ఐపీఎల్ 2026: లఖ్‌నవూతో కీలక పోరు.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్
PBKS vs LSG

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన పంజాబ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎల్ఎస్‌జీ తొలుత బ్యాటింగ్ చేయనుంది. కాగా పంజాబ్ జట్టుకు ఈ పోరు అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇరుజట్లకు ఇదే చివరి లీగ్ స్టేజ్ మ్యాచ్. కాగా లఖ్‌నవూ జట్టు ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పోరులో నెగ్గడంతో పాటు.. ఇతర జట్ల ఫలితాల మీద పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ బెర్తు ఆధారపడి ఉంది.


పంజాబ్ కింగ్స్ తుది జట్టు

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలీ, సూర్యాంశ్ షెడ్గె, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఓమర్జాయ్, యాన్సెన్, విజయకుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: హర్‌ప్రీత్ బ్రార్, స్టోయినిస్, బార్ట్‌లెట్, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబె


ఎల్ఎస్‌జీ తుది జట్టు

రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), జోష్ ఇంగ్లిస్, కులకర్ణి, నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, అర్జున్ టెండూల్కర్, షమి, ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: షాబాజ్ అహ్మద్, దిగ్వేశ్ సింగ్, సిద్ధార్థ్, హిమ్మత్ సింగ్, ఆకాశ్ మహరాజ్ సింగ్


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. సమీకరణాలు ఇలా!

షేక్‌హ్యాండ్ వివాదం.. కోహ్లీ అలా చేసి ఉండకూడదు: ఇర్ఫాన్ పఠాన్

Updated Date - May 23 , 2026 | 07:13 PM