Share News

పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్.. ఇద్దరు కోచ్‌లు రాజీనామా

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:19 PM

2027 సీజన్‌కు సంబంధించి ఐపీఎల్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ జట్లలో ఒకటైన పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది.

 పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్.. ఇద్దరు కోచ్‌లు రాజీనామా
Punjab Kings

స్పోర్ట్స్ డెస్క్: 2027 సీజన్ కు సంబంధించి ఐపీఎల్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ జట్లలో ఒకటైన పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ (ఆస్ట్రేలియా), ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ (ఆస్ట్రేలియా) తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరికి బిగ్ బాష్ లీగ్ (BBL)లో కొత్త బాధ్యతలు లభించినట్లు సమాచారం. ఆ కారణంతోనే పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.


పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్‌ ఉన్నసంగతి తెలిసిందే. పాటింగ్, హాడిన్‌, హోప్స్‌ వృత్తిపరంగా అత్యంత సన్నిహితులు. ముఖ్యంగా హోప్స్‌, పాంటింగ్‌ బెస్ట్ ఫ్రెండ్స్ అని క్రీడా వర్గాల్లో టాక్. పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌లోకి వచ్చిన సమయంలోనే హోప్స్‌ను కూడా తనతో పాటు తెచ్చుకున్నాడు.దీని బట్టి వాళ్లిద్దరీ సానిహిత్య సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే హాడిన్ గతంలో పంజాబ్ కింగ్స్‌కు కోచ్‌గా ఉన్న ట్రెవర్ బేలిస్ హయాం నుంచి కొనసాగుతున్నాడు.


మరోవైపు స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే కూడా ఇప్పటికే పంజాబ్ కింగ్స్‌ను వీడాడు. ఆ వెంటనే గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలోని భారత జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బహుతులే చేరాడు. కోచింగ్ బృందంలో కీలక వ్యక్తులు వైదొలగడంతో పంజాబ్‌ కింగ్స్‌ కొత్త వారి కోసం వేటసాగిస్తోంది. ఈ బాధ్యతను ప్రధాన కోచ్‌ పాంటింగ్‌కే అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే పాంటింగ్ కూడా పంజాబ్ జట్టును వీడుతాడని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా పంజాబ్ కింగ్స్ జట్టులో జరుగుతున్న పరిణామాలు అందరిలో ఆసక్తిరేపుతున్నాయి. 2027 సీజన్ ప్రారంభమయ్యే నాటికి పంజాబ్ జట్టు స్వరూపం ఎలా ఉండబోతుందా అని క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి:

రంజీ ట్రోఫీకి బిహార్ జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు

హర్మన్ ప్రీత్ కౌర్ బాటలో శ్రీలంక కెప్టెన్ ధనంజయ

ముగిసిన అజిత్ అగార్కర్ పదవి కాలం.. జడేజా పోస్ట్ వైరల్

Updated Date - Oct 08 , 2026 | 04:30 PM