Share News

కోహ్లీ ఔటైతే తినాలనిపించేది కాదు.. నానా పటేకర్ త్రోబ్యాక్ వీడియో వైరల్!

ABN , Publish Date - Oct 08 , 2026 | 03:16 PM

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. 75 ఏళ్ల వయసున్న ఆయన గోవాలోని తన నివాసంలో ఇవాళ వేకువజామున గుండెపోటుకు గురై మరణించారు. ఈ నేపథ్యంలో..

కోహ్లీ ఔటైతే తినాలనిపించేది కాదు.. నానా పటేకర్ త్రోబ్యాక్ వీడియో వైరల్!
Nana Patekar

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. 75 ఏళ్ల వయసున్న ఆయన గోవాలోని తన నివాసంలో ఇవాళ(గురువారం) వేకువజామున గుండెపోటుకు గురై మరణించారు. నానా పటేకర్ అకస్మాత్తుగా అచేతనంగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు, సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించే యత్నం చేశారు. పరీక్షించిన వైద్యులు.. ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. ఇది ఇలా ఉంటే.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీపై తనకు ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ గతంలో నానా పటేకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.


ఆ వీడియోలో పటేకర్ మాట్లాడుతూ.. ' నా ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. అతడు త్వరగా ఔటైతే.. ఆ రోజు నాకు భోజనం చేయాలని అనిపించదు' అని తెలిపారు. కోహ్లీ అతిపెద్ద మద్దతుదారుని కోల్పోయాడని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'నానా పటేకర్ సార్.. మిమ్మల్ని మిస్ అవుతున్నాము.మీ అత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాము' అని విరాట్ అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.


క్రికెటర్ల నివాళ్లు:

నానా పటేకర్‌కు పలువురు క్రికెటర్ల నివాళ్లర్పించారు. సోషల్ మీడియా ద్వారా కోహ్లీ తన సంతాపం వ్యక్తం చేస్తూ.. భారతీయ సినిమాకు పటేకర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. 'భారతీయ సినిమాకు చెందిన నిజమైన దిగ్గజం నానా పటేకర్. ఆయన ప్రతిభ, నటన వారసత్వం తరతరాల పాటు నిలిచి ఉంటాయి. నానా పటేకర్ జీ.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి' అని కోహ్లీ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ సంతాపం తెలిపారు. 'నిజంగా ఒక అసాధారణ ప్రతిభావంతుడని, ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ధావన్ పేర్కొన్నారు. అలానే భారత మాజీ బ్యాటర్ అజింక్య రహానే కూడా పటేకర్ కు నివాళులర్పించారు. 'నానా పటేకర్ గారు నిజంగా ఒక అద్భుతమైన నటుడు. ఆయన నటన తరతరాలకు స్ఫూర్తినిచ్చి, వినోదాన్ని పంచింది. ఆయన మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని రహానే అన్నారు.


ఇవి కూడా చదవండి:

రంజీ ట్రోఫీకి బిహార్ జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు

హర్మన్ ప్రీత్ కౌర్ బాటలో శ్రీలంక కెప్టెన్ ధనంజయ

ముగిసిన అజిత్ అగార్కర్ పదవి కాలం.. జడేజా పోస్ట్ వైరల్

Updated Date - Oct 08 , 2026 | 04:01 PM