మన కుర్రాళ్లు.. క్లీన్‌స్వీప్ చేశారు
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:43 AM
యా అండర్-19 జట్టుతో జరిగిన రెండు యూత్ టెస్టుల సిరీ్‌సను భారత అండర్-19 జట్టు 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. స్పిన్నర్ తన్మయ్...
రెండో యూత్ టెస్టులో ఆసీస్
అండర్-19పై ఘన విజయం
అహ్మదాబాద్: ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన రెండు యూత్ టెస్టుల సిరీ్‌సను భారత అండర్-19 జట్టు 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. స్పిన్నర్ తన్మయ్ బలోదా మొత్తంగా 14 వికెట్లతో విజృంభించడంతో బుధవారం ముగిసిన రెండో టెస్టులో భారత యువ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. పది పరుగుల స్వల్ప ఛేదనతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియా 0.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 11 రన్స్ చేసి గెలిచింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 86/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. తన్మయ్ (8/41) ధాటికి 151 పరుగులకే కుప్పకూలింది. బ్లేక్ కాటిల్ (63) టాప్ స్కోరర్. తన్మయ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ ఆరు వికెట్లతో అదరగొట్టాడు. ఇక, మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 174, భారత్ 315 రన్స్ చేశాయి. కాగా, అంతకుముందు ఆసీస్ అండర్-19పై జరిగిన మూడు వన్డేల సిరీ్‌సను కూడా యువ భారత్ 3-0తో నెగ్గిన సంగతి తెలిసిందే.
తన్మయ్ రికార్డు: రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 73 పరుగులిచ్చి 14 వికెట్లతో చెలరేగిన తన్మయ్ బలోదా.. యూత్ టెస్టు చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన క్రికెటర్‌గా అరుదైన రికార్డు సాధించాడు. ఈ క్రమంలో 2007లో టిమ్ సౌథీ (92 పరుగులిచ్చి 12 వికెట్లు) రికార్డును తన్మయ్ అధిగమించాడు.
ఇవి కూడా చదవండి:
ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ
తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి