Share News

ఇదేం విచిత్రం.. ఫీల్డింగ్ కోచ్ కోసం లింక్‌డిన్‌లో పాకిస్థాన్ ఓపెన్ హైరింగ్!

ABN , Publish Date - Sep 02 , 2026 | 07:00 AM

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి వార్తల్లో నిలిచింది. జట్టులో ఫీల్డింగ్ ప్రమాణాలు దిగజారుతున్నాయన్న విమర్శల వేళ.. పీసీబీ కొత్త ఫీల్డింగ్ కోచ్ కోసం అన్వేషణ మొదలు పెట్టింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది..

ఇదేం విచిత్రం.. ఫీల్డింగ్ కోచ్ కోసం లింక్‌డిన్‌లో పాకిస్థాన్ ఓపెన్ హైరింగ్!
Pakistan Cricket Board

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి వార్తల్లో నిలిచింది. జట్టులో ఫీల్డింగ్ ప్రమాణాలు దిగజారుతున్నాయన్న విమర్శల వేళ.. పీసీబీ కొత్త ఫీల్డింగ్ కోచ్ కోసం అన్వేషణ మొదలు పెట్టింది. ఇటీవలే షేన్ మెక్‌డెర్మాట్ పదవీకాలం ముగియడంతో ఆయన జట్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు పీసీబీ దరఖాస్తులకు ఆహ్వానించింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.. కోచ్ నియామకానికి పీసీబీ లింక్‌డిన్‌లో ఓపెన్ హైరింగ్ మొదలు పెట్టింది. పాక్ క్రికెట్ బోర్డు ఎంచుకున్న ఈ విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్‌కి గురవుతోంది. నెటిజన్లు సెటైర్లు, విమర్శలతో బోర్డుపై విరుచుకుపడుతున్నారు.


‘ఫీల్డింగ్ కోచ్‌ను ఇలా కూడా ఎంపిక చేస్తారా?’, ‘పాకిస్థాన్ మనకు ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికే ఉంది’, ‘వీళ్లు ఇక మారరు’.. అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. పాక్ బోర్డు ఫీల్డింగ్ కోచ్‌ను ఎంపిక చేసే విధానాన్ని చూసి నవ్వుకుంటున్నారు.


పాకిస్థాన్‌ పురుషుల సీనియర్‌ జట్టుకు అన్ని ఫార్మాట్లలో ఫీల్డింగ్‌ ప్రమాణాలను మెరుగుపరిచే బాధ్యత కొత్త కోచ్‌పై ఉంటుందని పీసీబీ పేర్కొంది. ఇందుకోసం అభ్యర్థికి కనీసం లెవల్‌-2 క్రికెట్‌ కోచింగ్‌ అర్హత, సంబంధిత విభాగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎలైట్‌ ఆటగాళ్లు, జాతీయ జట్లు లేదా ఫ్రాంచైజీ జట్లతో పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ ఘోర పరాజయం అనంతరం పీసీబీ భారీ ప్రక్షాళనకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడంతో పాటు కోచింగ్‌ సిబ్బంది, సెలక్షన్‌ కమిటీలోనూ మార్పులు చేపట్టింది. కొత్త ఫీల్డింగ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్‌ 9 చివరి తేదీగా పీసీబీ నిర్ణయించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు PCB అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది.


ఇవి కూడా చదవండి:

అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ

పాకిస్థాన్ క్రికెట్‌లో అలజడి.. సెలెక్షన్ కమిటీకి మిస్బా ఉల్ హక్ రాజీనామా!

Updated Date - Sep 02 , 2026 | 07:01 AM