అల్కారజ్, సబలెంక ముందంజ
ABN , Publish Date - Sep 02 , 2026 | 05:55 AM
గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన కార్లోస్ అల్కారజ్ అలవోకగా ముందంజ వేయగా.. హ్యాట్రిక్‌పై గురిపెట్టిన టాప్ సీడ్ అరియానా సబలెంక, ఇగా స్వియటెక్, నవోమి ఒసాకా...
స్వియటెక్, ఒసాకా కూడా యూఎస్ ఓపెన్
న్యూయార్క్: గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన కార్లోస్ అల్కారజ్ అలవోకగా ముందంజ వేయగా.. హ్యాట్రిక్‌పై గురిపెట్టిన టాప్ సీడ్ అరియానా సబలెంక, ఇగా స్వియటెక్, నవోమి ఒసాకా కూడా యూఎస్ ఓపెన్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో రెండో సీడ్ అల్కారజ్ 6-4, 6-4, 6-4తో రోమన్ సఫిల్లీన్‌పై వరుస నెట్లలో నెగ్గాడు. మూడో సీడ్ ఫెలిక్స్ ఔజర్ అలియస్సమీ 7-5, 4-6, 6-3, 7-5తో రింకీ హిజికటాపై, బెన్ షెల్టన్ 1-6, 6-1, 7-6(3), 6-2తో టాలన్ గ్రీక్‌స్ఫూర్‌పై, జాకబ్ మెన్సిక్ 6-1, 6-4, 7-5తో షింటారో మొజిచుక్‌పై గెలిచారు. కాగా, 2016 చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (41) ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. వావ్రింకా 6-7(4), 6-7(3), 0-6తో మాటియో బెరెట్టిని చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో సబలెంక 6-2, 6-4తో కెమెల్లా ఒసోరియో, ఒసాక 7-6(6), 7-6(3)తో అనస్టాసియా జకరోవాను, 8వ సీడ్ స్వియటెక్ 6-3, 6-3తో వాంగ్ జియును, వింబుల్డన్ చాంప్ లిండా నోస్కోవా 7-5, 6-1తో కేటీ వోలినెట్స్‌ను, స్లోన్ స్టీఫెన్స్ 6-4, 6-1తో క్లారా టాసన్‌ను, డయానా ష్నైడర్ 6-0, 6-4తో డారియా స్నిగుర్‌ను, సినియకొవా 6-3, 6-2తో ఎలిజబెత్ కొక్కియారిటో, అన్ లి 7-5, 6-1తో ఆంటోనియా రుజిక్‌ను ఓడించారు.
ఇవి కూడా చదవండి:
అఫ్గాన్‌తో టీ20 సిరీస్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
పాకిస్థాన్ క్రికెట్‌లో అలజడి.. సెలెక్షన్ కమిటీకి మిస్బా ఉల్ హక్ రాజీనామా!