Share News

పడిక్కల్ టాటూ, పంత్ గాయం.. శ్రీలంక టెస్టు ఫొటోలు పంచుకున్న ప్లేయర్లు!

ABN , Publish Date - Aug 28 , 2026 | 03:11 PM

శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ పోరాట గాయాలను భారత ప్లేయర్లు దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

పడిక్కల్ టాటూ, పంత్ గాయం.. శ్రీలంక టెస్టు ఫొటోలు పంచుకున్న ప్లేయర్లు!
Devdutt Padikkal

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో రెండో టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలన్న టీమిండియా ఆశలకు బ్రేక్ పడినట్లైంది. ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్లేయర్లు మైదానంలో తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో టెస్టు మ్యాచ్ పోరాట గాయాలను భారత ప్లేయర్లు దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఫీల్డింగ్‌లో ఎక్కువ సేపు మైదానంలోనే ఉండాల్సి రావడంతో ట్యాన్ వచ్చి పడిక్కల్ వీపుపై తన జెర్సీ నంబర్, పేరు ‘టాటూ’లా పడింది. ఆ ఫోటోతో పాటు శ్రీలంక పర్యటనలోని మరికొన్ని జ్ఞాపకాలను కూడా షేర్ చేశాడు. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన పడిక్కల్ మూడు ఇన్నింగ్స్‌ల్లో 328 పరుగులు చేశాడు. వరుసగా రెండు సెంచరీలు బాది ‘ప్లేయర్ ఆఫ్ సిరీస్’గా నిలిచాడు.


చిన్న జ్ఞాపకం..

మరోవైపు పంత్ మ్యాచ్ సందర్భంగా తగిలిన గాయం ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. ‘ఇదొక చిన్న జ్ఞాపకం’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. రెండో టెస్టు మ్యాచ్‌లో భుజానికి గాయం కావడంతో పంత్‌ రెండో టెస్టులో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ సిరీస్‌లో పంత్‌ మూడు ఇన్నింగ్స్‌ల్లో 168 పరుగులు చేశాడు. 56 సగటుతో పాటు 76కు పైగా స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేసిన అతడు రెండు అర్ధసెంచరీలు సాధించాడు.


ఇవి కూడా చదవండి:

లక్ష చెట్లకు రాఖీలు.. ప్రకృతి పరిరక్షణకు జార్ఖండ్ ప్రజల కంకణం!

సెప్టెంబరు 1 నుంచి దానాపూర్‌ - బెంగళూరు రైలు

Updated Date - Aug 28 , 2026 | 03:11 PM