గ్రాండ్ చెస్ టూర్-2026 విజేతగా ప్రజ్ఞానంద
ABN , Publish Date - Aug 28 , 2026 | 10:51 AM
భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు.
స్పోర్ట్స్ డెస్క్: భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద((Praggnanandhaa)) సరికొత్త చరిత్ర సృష్టించాడు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరునావాపై 15-13 తేడాతో ప్రజ్ఞానంద విజయం సాధించాడు. ఆఖరి రోజు ఆట ప్రారంభంలో 6 పాయింట్ల వెనుకంజలో ఉన్న ప్రజ్ఞానంద.. వరుసగా రెండు ర్యాపిడ్ గేమ్‌లను గెలిచి ఆధిక్యంలోకి వచ్చాడు. దీంతో గ్రాండ్ చెస్ టూర్‌లో తుది పోరులో విజయం సాధించి.. ఛాంపియన్‌గా నిలిచాడు. దాదాపు రూ.2 కోట్ల ప్రైజ్‌మనీని ప్రజ్ఞానంద గెలుచుకున్నాడు. దీంతో వచ్చే ఏడాది జరిగే గ్రాండ్ చెస్ టూర్‌కు నేరుగా అర్హత సాధించాడు.
ఇక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలవడంపై ప్రజ్ఞానంద సంతోషం వ్యక్తం చేశాడు. ఇవాళ జరిగిన ఆటలో తనకు గెలిచే అవకాశలు వస్తాయని అనుకోలేదన్నారు. ఆరు పాయింట్లు వెనుకబడి ఉన్న సమయంలో ఎలా ఆడాలో చూపించానని పేర్కొన్నాడు. ఫాబి వంటి ప్లేయర్‌పై ఒక్క మ్యాచ్ గెలవడమే కష్టం, అలాంటిది ర్యాపిడ్‌లో రెండు గేమ్‌ల్లో విజయం సాధించానని తెలిపాడు. గతేడాది నుంచి తన ర్యాపిడ్, బ్లిట్జ్ ఆటలో మార్పులు జరిగాయని, ప్రస్తుతం ఆ ఫలితం కనిపించిందని పేర్కొన్నాడు. ఈ ఫార్మాట్‌లో మెరుగయ్యాననే అనుకుంటున్నానని ప్రజ్ఞానంద తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
30న మారథాన్.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
కాలుష్యంపై కృష్ణంపాలెం గ్రామస్థుల విజ్ఞప్తి.. డిప్యూటీ సీఎం తక్షణ స్పందన