తన రికార్డును తిరిగి సొంతం చేసుకున్న కీరన్ పొలార్డ్
ABN , Publish Date - Aug 28 , 2026 | 09:46 AM
టీ20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ త్త రికార్డును సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ సరికొత్త రికార్డును సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ నమోదు చేసిన 14,890 పరుగుల రికార్డును పొలార్డ్ అధిగమించాడు. దీంతో తాను కోల్పోయిన అగ్రస్థానాన్నితిరిగి కైవసం చేసుకున్నాడు.
ఈ ఏడాది ప్రారంభంలో క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును పొలార్డ్ బ్రేక్ చేసినప్పటికీ, ఆగస్టులో బట్లర్ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే, కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగిన పొలార్డ్ కేవలం 26 బంతుల్లోనే 65 పరుగులు బాది.. అత్యధిక పరుగుల రికార్డును తిరిగి తన పేరు మీద లిఖించుకున్నాడు.
మరోవైపు, ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో విజయం సాధించింది. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌పై 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ టోర్నీలో ఆ జట్టు 200లకు పైగా పరుగులు చేయడం ఇది రెండోసారి. పొలార్డ్ వ్యక్తిగతంగా అద్భుతమైన మైలురాయిని అందుకున్నప్పటికీ, అతడి జట్టుకు మాత్రం విజయం దక్కలేదు.
ఇవి కూడా చదవండి:
సచిన్ రికార్డును నా కొడుకు అందుకోలేడు: జో రూట్ తండ్రి మాట్