సచిన్ రికార్డును నా కొడుకు అందుకోలేడు: జో రూట్ తండ్రి మాట్
ABN , Publish Date - Aug 28 , 2026 | 07:37 AM
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఆ రికార్డుకు కాస్త దగ్గర వచ్చాడు. దీంతో సచిన్ రికార్డును రూట్ బ్రేక్ చేస్తాడా అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ దిగ్గజం, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కొన్ని రికార్డులు బద్దలైనప్పటికీ మరికొన్ని మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. కొందరు ప్లేయర్లు సచిన్ రికార్డులకు దగ్గరగా వచ్చి ఆగిపోయారు. పలు సందర్భాల్లో కొందరు ఆటగాళ్లు సచిన్ రికార్డు కాస్త దగ్గరగా వచ్చినప్పుడు.. వారు రికార్డును బ్రేక్ చేస్తారా లేదా అనే చర్చలు జరుగుతుంటాయి. తాజాగా సచిన్, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ విషయంలోనూ సర్వత్ర చర్చ జరుగుతోంది. మరి.. ఆస్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం...
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో(15,921 పరుగులు) ఉన్నాడు. ఇంగ్లండ్ స్టార్ జో రూట్ ప్రస్తుతం 167 టెస్టులాడి 14,180 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సచిన రికార్డును రూట్ అధిగమిస్తాడా లేదా అనే అంశంపై సర్వత్ర చర్చ జరుగుతోంది. దీనిపై రూట్ తండ్రి మాట్ రూట్ తాజాగా స్పష్టతనిచ్చారు. సచిన్ రికార్డును రూట్ అందుకోవడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
జో రూట్ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, ఆటపై సరైన దృష్టిసారించి, ఆడే తపనను కొనసాగిస్తే సచిన్ రికార్డుకు అత్యంత సమీపంగా వెళ్లే అవకాశం ఉందని ఆయన ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గతంలో కెప్టెన్‌గా ఉన్న సమయంలోనూ రూట్ ఒకే ఏడాదిలో 1,700 పైచిలుకు పరుగులు సాధించాడని, కెప్టెన్సీ బాధ్యతలు తన బ్యాటింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపవని రూట్ నిరూపించాడని గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి:
0, 0, 0.. టీ20 చరిత్రలో అద్భుతం.. ఐదు గోల్డెన్ డక్‌లు!
న్యూజిలాండ్‌లో భారత్ టూర్‌కు భారీ క్రేజ్..రికార్డు స్థాయిలో టికెట్ల విక్రయం!