Share News

భారత్‌కు ఎదురుందా?

ABN , Publish Date - Aug 28 , 2026 | 08:11 AM

మహిళల ధనాధన్‌ క్రికెట్‌కు వేళైంది. ఎనిమిది జట్ల టీ20 ఆసియాక్‌పనకు శుక్రవారం తెరలేవనుంది. ఆరంభ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో హాంకాంగ్‌ తలపడనుంది.

భారత్‌కు ఎదురుందా?
Women's Asia Cup 2026

  • పోటీలో పాక్‌, శ్రీలంక, బంగ్లా

  • నేటి నుంచి మహిళల ఆసియా కప్‌

  • 5న దాయాదుల పోరు


దుబాయ్‌: మహిళల ధనాధన్‌ క్రికెట్‌కు వేళైంది. ఎనిమిది జట్ల టీ20 ఆసియాక్‌పనకు శుక్రవారం తెరలేవనుంది. ఆరంభ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో హాంకాంగ్‌ తలపడనుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలో భారత మహిళల జట్టు మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. డిఫెండింగ్‌ చాంప్‌ శ్రీలంక మరోసారి టైటిల్‌ నెగ్గాలనే పట్టుదలతో ఉంది. 2024 టోర్నీ ఫైన ల్లో భారత్‌ను ఓడించిన శ్రీలంక విజేతగా నిలిచింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు కూడా సత్తాచాటాలనుకొంటున్నా యి. కాగా, ఆసియా క్రీడల ముందు తుది మెరుగులు దిద్దుకోవడానికి కూడా ఆయా జట్లకు ఇది సువర్ణావకాశం కావడంతో.. పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.


గ్రూప్‌-ఎలో భారత్‌తోపాటు పాకిస్థాన్‌, హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌ టీమ్‌లు ఉండగా.. గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, యూఏఈ, ఇండోనేసియా జట్లు ఆడనున్నాయి. గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఇండోనేసియా తొలిసారి ఆసియా కప్‌లో ఆడే అవకాశం దక్కించుకోగా.. 2012 తర్వాత హాంకాంగ్‌ బరిలోకి దిగుతోంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ఇండో-పాక్‌ మ్యాచ్‌ను వచ్చే నెల 5న షెడ్యూల్‌ చేశారు.


మొత్తం 15 మ్యాచ్‌లు..

టోర్నీ నేటి నుంచి సెప్టెంబరు 13 వరకు దుబాయ్‌లో నిర్వహించనున్నారు. మొత్తం 15 మ్యాచ్‌ల్లో 12 గ్రూప్‌ మ్యాచ్‌లు, రెండు సెమీస్‌, ఫైనల్‌ జరగనున్నాయి. వచ్చే నెల 10, 11న సెమీస్‌ మ్యాచ్‌లు.. 13న ఫైనల్‌ను షెడ్యూల్‌ చేశారు.

రికార్డులు..

భారత్‌ మూడుసార్లు (2012, 2016, 2022) ఆసియా కప్‌ విజేతగా నిలవగా.. రెండుసార్లు రన్నర్‌పగా సరిపెట్టుకొంది. వన్డే ఆసియా కప్‌ను నాలుగుసార్లు సొంతం చేసుకొంది.


భారత మ్యాచ్‌ల షెడ్యూల్‌

  • ఆగస్టు 30: భారత్‌ vs థాయ్‌లాండ్‌

  • సెప్టెంబరు 3: భారత్‌ vs హాంకాంగ్‌

  • సెప్టెంబరు 5: భారత్‌ vs పాక్‌

    (మ్యాచ్‌లన్నీ రాత్రి 8 నుంచి)


ఇవి కూడా చదవండి:

సచిన్ రికార్డును నా కొడుకు అందుకోలేడు: జో రూట్ తండ్రి మాట్

0, 0, 0.. టీ20 చరిత్రలో అద్భుతం.. ఐదు గోల్డెన్‌ డక్‌లు!

Updated Date - Aug 28 , 2026 | 08:12 AM