Share News

అండర్‌-19 జట్టులో ద్రవిడ్‌, సెహ్వాగ్‌ కుమారులు

ABN , Publish Date - Aug 28 , 2026 | 08:37 AM

ఆస్ట్రేలియా కుర్రాళ్లతో జరిగే వన్డే, మల్టీడే మ్యాచ్‌ల కోసం సెలెక్టర్లు రెండు జట్లను ప్రకటించారు. ఇందులో వీరేంద్ర సెహ్వాగ్‌ కుమారుడు ఆర్యవీర్‌కు తొలిసారి చోటు కల్పించారు.

అండర్‌-19 జట్టులో ద్రవిడ్‌, సెహ్వాగ్‌ కుమారులు
India U19 vs Australia U19

  • తెలుగు ఆటగాడు యశ్‌వీర్‌ గౌడ్‌ సైతం..

  • ఆసీస్‌తో వన్డే సిరీస్‌


న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా కుర్రాళ్లతో జరిగే వన్డే, మల్టీడే మ్యాచ్‌ల కోసం సెలెక్టర్లు రెండు జట్లను ప్రకటించారు. ఇందులో వచ్చే నెల 18, 21, 23 తేదీల్లో జరిగే వన్డేల కోసం వీరేంద్ర సెహ్వాగ్‌ కుమారుడు ఆర్యవీర్‌కు తొలిసారి చోటు కల్పించారు. అలాగే రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు అన్వయ్‌ తన స్థానాన్ని నిలబెట్టుకొన్నాడు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా రాజా పేటకు చెందిన స్పిన్నర్‌ ఊట్కూరి యశ్‌వీర్‌ గౌడ్‌ కూడా తన చోటు కాపాడుకున్నాడు. వన్డేలకు లక్ష్య రాయ్‌చందానీ, మల్టీడే మ్యాచ్‌లకు యష్‌బర్దన్‌ చౌహాన్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.


ఇవి కూడా చదవండి:

భారత్‌కు ఎదురుందా?

సచిన్ రికార్డును నా కొడుకు అందుకోలేడు: జో రూట్ తండ్రి మాట్

Updated Date - Aug 28 , 2026 | 08:37 AM