Share News

అజింక్య రహానేకు అరుదైన గౌరవం.. అతడి పేరిట స్కాలర్‌షిప్‌

ABN , Publish Date - Aug 28 , 2026 | 02:05 PM

టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానేకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన పేరిట ఓ స్కాలర్‌షిప్‌ ఇవ్వాలని ముంబై క్రికెట్ అసోసియేషన్‌ నిర్ణయించింది.

అజింక్య రహానేకు అరుదైన గౌరవం.. అతడి పేరిట స్కాలర్‌షిప్‌
Ajinkya Rahane

స్పోర్ట్స్ డెస్క్: ఇటీవలే టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానే (Ajinkya Rahane) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు పలికిన సంగతి తెలిసిందే. రిటైర్‌మెంట్ తర్వాత తరచూ భారత క్రికెట్ జట్టుకు సంబంధించి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే.. తాజాగా అజింక్య రహానేకు ఓ గొప్ప గౌరవం దక్కింది. ఆయన పేరిట ఓ స్కాలర్‌షిప్‌ రానుంది. ఈమేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది.


గురువారం ముంబై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సభ్యులు చర్చించారు. బీసీసీఐతో ఒప్పందం లేని ఎంసీఏ పురుష, మహిళా క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్ట్‌ ఇవ్వాలని కౌన్సిల్ నిర్ణయించింది. అలాగే రహానే పేరిట అర్హులైన ఆటగాళ్లకు స్కాలర్‌షిప్‌ను ఇవ్వనుంది. క్షేత్ర స్థాయిలో యువ క్రికెటర్లకు ప్రోత్సాహం అందించేందుకు ఈ స్కాలర్‌షిప్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. ముంబై జట్టుకు రహానే కెప్టెన్‌గా రంజీ ట్రోఫీలను అందించిన చరిత్ర ఉంది. అతడి సేవలకు గుర్తుగా ఈ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు రహానే పేరు పెట్టినట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్షుడు అజింక్య నాయక్ తెలిపారు. దీనికి ఎంసీఏ మాజీ ప్రెసిడెంట్ శరద్‌ పవార్ కూడా కొంత ఫండ్‌ను అందించనున్నారు.


ముంబై క్రికెట్ అసోసియేషన్‌ తరఫున 22 మంది క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్ట్‌లు దక్కాయి. ఇందులో 14 మంది పురుషులు, 8 మంది మహిళా క్రికెటర్లు ఉన్నారు. గ్రేడ్‌ - ఏలో రూ. 12 లక్షలు, గ్రేడ్-బి ఆటగాళ్లకు రూ.8 లక్షలు, గ్రేడ్‌-సిలో ఉన్న వారికి రూ.6 లక్షలు అందనుంది. గ్రేడ్‌ఏలో సిద్దేశ్‌, షామ్స్‌ ములానికి అవకాశం వరించింది. సానికా చాల్కే గ్రేడ్-బిలో నిలిచింది. ప్రకాశిక నాయక్, ఫాతిమా జాఫర్‌తో సహా మరో ఐదుగురు క్రీడాకారిణులుగా గ్రేడ్-సిలో ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

లక్ష చెట్లకు రాఖీలు.. ప్రకృతి పరిరక్షణకు జార్ఖండ్ ప్రజల కంకణం!

సెప్టెంబరు 1 నుంచి దానాపూర్‌ - బెంగళూరు రైలు

Updated Date - Aug 28 , 2026 | 02:05 PM