రాఖీ కేవలం దారం కాదు.. ప్రేమ, నమ్మకం, బాధ్యతకు ప్రతీక: బాలకృష్ణ
ABN , Publish Date - Aug 28 , 2026 | 01:32 PM
పవిత్రమైన రక్షా బంధన్ సందర్భంగా ప్రజలందరికీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ అనేది కేవలం ఒక దారం కాదని.. అది ప్రేమకు, నమ్మకానికి, బాధ్యతకు జీవితాంతం నిలిచే అనుబంధానికి ప్రతీకన్నారు.
అమరావతి, ఆగస్టు 28: పవిత్రమైన రక్షా బంధన్ సందర్భంగా ప్రజలందరికీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ అనేది కేవలం ఒక దారం కాదని.. అది ప్రేమకు, నమ్మకానికి, బాధ్యతకు, జీవితాంతం నిలిచే అనుబంధానికి ప్రతీకన్నారు. నేటి సమాజంలో ప్రతి మహిళ గౌరవంగా, భద్రంగా జీవించే వాతావరణాన్ని కల్పించడం, కుటుంబ బంధాలను ప్రేమతో, పరస్పర గౌరవంతో కాపాడుకోవడం అందరి బాధ్యతని చెప్పుకొచ్చారు.
రక్షా బంధన్ స్ఫూర్తి కేవలం అన్నాచెల్లెళ్ల బంధానికే పరిమితం కాకూడదని బాలయ్య అన్నారు. ప్రతి మహిళను గౌరవించే సంస్కృతిగా, ప్రతి కుటుంబాన్ని ఏకం చేసే విలువగా, ప్రతి మనిషిలో మానవత్వాన్ని పెంపొందించే సందేశంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన పర్వదినం ప్రతి ఇంట ఆనందాన్ని, ప్రతి హృదయంలో ప్రేమను, ప్రతి కుటుంబంలో ఐక్యతను నింపాలని ఎమ్మెల్యే బాలకృష్ణ మనసారా కోరుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ఏపీకి భారీ ప్రాజెక్ట్.. మూడో అతిపెద్ద డిజిటల్ ల్యాండింగ్ హబ్‌గా అవతరణ
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతల స్వీకరణ
Read Latest AP News And Telugu News