Share News

టీ20 ప్రపంచ కప్: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. ఇంగ్లండ్ టార్గెట్ 160

ABN , Publish Date - Feb 27 , 2026 | 08:41 PM

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.

టీ20 ప్రపంచ కప్: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. ఇంగ్లండ్ టార్గెట్ 160
New Zealand vs England

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు 160 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు.


గ్లెన్ ఫిలిప్స్(39) టాప్ స్కోరర్. టిమ్ సీఫర్ట్(35), ఫిన్ అలెన్(29) పర్వాలేదనిపించారు. రచిన్ రవీంద్ర(11), చాప్‌మన్(15), మిచెల్(3), కోంచీ(14) విఫలమయ్యారు. శాంట్నర్(9*), హెన్రీ(1*) నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 2, విల్ జాక్స్ 2, రెహాన్ అహ్మద్ 2, డాసన్ 1 వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. సెమీస్‌కు వెళ్తుంది. అలా జరిగితే పాకిస్థాన్ ఇంటిముఖం పడుతుంది.


ఇవి కూడా చదవండి:

వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!

టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్

Updated Date - Feb 27 , 2026 | 08:42 PM