మా కెప్టెన్ రోహిత్ కాదు.. ముంబై ఇండియన్స్
ABN , Publish Date - Oct 13 , 2026 | 09:55 PM
వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవరిస్తాడన్న ఊహాగానాలకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైసీ తెరదించింది. తమ టీంకు రోహిత్ కెప్టెన్‌గా ఉంటాడని వార్తలు వస్తున్నాయని, అయితే అవన్నీ ఊహాగానాలేనని ముంబై ఇండియన్స్ వర్గాలు తెలిపాయి. ఆ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవరిస్తాడన్న ఊహాగానాలకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైసీ తెరదించింది. తమ టీంకు రోహిత్ కెప్టెన్‌గా ఉంటాడని వార్తలు వస్తున్నాయని, అయితే అవన్నీ ఊహాగానాలేనని ముంబై ఇండియన్స్ వర్గాలు తెలిపాయి. ఆ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాయి. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు కెప్టెన్‌గా ఎవరిని నియమించాలన్న విషయంపై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొన్నాయి. గత సీజన్‌లో కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యనే మళ్లీ కొనసాగించే అవకాశం ఉందని ఆ వర్గాలు చెప్పాయి. ఒకవేళ తమ జట్టును హార్దిక్ వదిలివెళితే, ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని వెల్లడించాయి. అయితే, ఇప్పటివరకూ హార్దిక్‌కు సరైన ప్రత్యామ్నాయం కనిపించలేదని తెలిపాయి. హార్దిక్ తమ జట్టును వీడితే.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ జట్టును నడిపించడానికి రెడీగా ఉన్నారని వివరించాయి. మిచెల్ సాంట్నర్ కూడా సిద్ధంగా ఉన్నాడని తెలిపాయి.
కాగా.. 2026 టీ20 వరల్డ్ కప్ టైటిల్ నెగ్గిన భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, ఆ టోర్నమెంట్ తర్వాత అతను కెప్టెన్సీని కోల్పోవడంతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయాడు. పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కారణంగా జట్టులో సూర్యకు మేనేజ్‌మెంట్ చోటు కల్పించలేదు. మరోవైపు తిలక్ వర్మ అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ స్క్వాడ్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అలాగే ఇండియా టీ20 జట్టుకు అతను వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
బవుమా అజేయ ప్రస్థానానికి తెర.. WTC పాయింట్ల పట్టికలో మారిన లెక్కలు!
ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన