Share News

టీమిండియా ఓటమిపై మిథాలీ రాజ్ కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jun 22 , 2026 | 06:04 PM

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఎదుర్కొన్న ఓటమిపై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించారు. ఈ పరాజయంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయని, ఇకపై నాకౌట్ చేరాలంటే ఆస్ట్రేలియాను కచ్చితంగా ఓడించాల్సిందేనని పేర్కొన్నారు.

 టీమిండియా ఓటమిపై మిథాలీ రాజ్ కీలక వ్యాఖ్యలు..
Mithali Raj analysis

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఎదుర్కొన్న ఓటమిపై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించారు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ మొదట 158 పరుగులు చేసినప్పటికీ మరిజానే కాప్ (81 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ వల్ల దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ పరాజయంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయని, ఇకపై నాకౌట్ చేరాలంటే ఆస్ట్రేలియాను కచ్చితంగా ఓడించాల్సిందేనని మిథాలీ పేర్కొన్నారు.


భారత బ్యాటింగ్ వైఫల్యాన్ని విశ్లేషిస్తూ.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాలని ఆమె సూచించారు. ఐదో స్థానంలో కాకుండా హర్మన్‌ప్రీత్ నాలుగో స్థానంలో రావాలని, జెమిమా రోడ్రిగ్స్‌ను ఐదో స్థానంలో పంపాలని అభిప్రాయపడ్డారు. స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే జెమిమాకు ఐదో స్థానం కలిసొస్తుందని తెలిపారు. అయితే, ఈ ఓటమిలోనూ భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి ప్రదర్శనను మిథాలీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇంగ్లండ్ పిచ్‌లపై ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న శ్రీ చరణి.. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి భారత్‌ను మ్యాచ్‌లోకి తెచ్చిందని కొనియాడారు. పిచ్ నుంచి పెద్దగా టర్న్ లభించకపోయినప్పటికీ.. లైన్ అండ్ లెంగ్త్‌ను నియంత్రిస్తూ, వికెట్లను టార్గెట్ చేస్తూ చరణి అద్భుతంగా బౌలింగ్ చేసిందని మిథాలీ రాజ్ ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి:

విధ్వంసం.. ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు.. వీడియో వైరల్!

పాకిస్థాన్, ఇంగ్లండ్ ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు..!

Updated Date - Jun 22 , 2026 | 06:51 PM