Share News

భారత్‌కు సహాయం.. కీలక ఆయుధాల సర్వీసులకు అమెరికా సిద్ధం..

ABN , Publish Date - Jun 22 , 2026 | 10:39 AM

భారత్‌కు చెందిన కీలక రక్షణ వ్యవస్థల నిర్వహణ, సాంకేతిక మద్దతు కోసం అమెరికా సహాయం చేయబోతోంది. ఈ మేరకు అమెరికా 428.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3,600 కోట్లకు పైగా) విలువైన రెండు రక్షణ సహాయ ప్యాకేజీలకు ఆమోదం తెలిపింది.

భారత్‌కు సహాయం.. కీలక ఆయుధాల సర్వీసులకు అమెరికా సిద్ధం..
India US Defence Deal

భారత్‌కు చెందిన కీలక రక్షణ వ్యవస్థల నిర్వహణ, సాంకేతిక మద్దతు కోసం అమెరికా సహాయం చేయబోతోంది. ఈ మేరకు అమెరికా 428.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3,600 కోట్లకు పైగా) విలువైన రెండు రక్షణ సహాయ ప్యాకేజీలకు ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలను కొత్త ఆయుధాల కొనుగోలు కోసం కాకుండా ఇప్పటికే భారత సైన్యంలో సేవలందిస్తున్న వ్యవస్థల నిర్వహణ, శిక్షణ, విడిభాగాల సరఫరా కోసం కేటాయించారు. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్‌కు విదేశాంగ శాఖ తెలియజేసింది (India US Defence Deal).


అమెరికా ఇవ్వనున్న 428.2 మిలియన్ డాలర్ల ప్యాకేజీలో 198.2 మిలియన్ డాలర్లను ఏహెచ్-64ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్ల నిర్వహణ కోసం కేటాయించారు (Apache Helicopter Support). ఇందులో ఇంజినీరింగ్ సేవలు, సాంకేతిక సహాయం, లాజిస్టిక్ మద్దతు, శిక్షణ వంటి అంశాలు ఉన్నాయి. ఈ ప్యాకేజీకి బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు ప్రధాన కాంట్రాక్టర్లుగా ఉంటాయి.


మరో 230 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ఎం-777 ఏ2 అల్ట్రా-లైట్ హోవిట్జర్ తుపాకుల నిర్వహణకు కేటాయించారు (M777 Howitzer Support). దీనిలో విడిభాగాలు, సాంకేతిక సహాయం, శిక్షణ, లాజిస్టిక్ మద్దతు వంటి సేవలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన కాంట్రాక్టర్‌గా బీఏఈ సిస్టమ్స్ వ్యవహరించనుంది.


ఈ ఒప్పందాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది (US Defence Package India). ఈ సహాయం ద్వారా ప్రస్తుత, భవిష్యత్తు భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటుందని తెలిపింది.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


క్యాబ్ డ్రైవర్‌కు జాక్‌పాట్.. రూ.500తో టికెట్ కొంటే రూ.3 కోట్లు..

Updated Date - Jun 22 , 2026 | 10:43 AM