క్యాబ్ డ్రైవర్‌కు జాక్‌పాట్.. రూ.500తో టికెట్ కొంటే రూ.3 కోట్లు..
ABN , Publish Date - Jun 22 , 2026 | 07:17 AM
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన క్యాబ్ డ్రైవర్ కల్యాణ్ చంద్ జాక్‌పాట్ కొట్టారు. ఇటీవల ఓ ప్రయాణికుడిని దింపేందుకు పంజాబ్‌లోని బఠిండాకు వెళ్లిన కల్యాణ్ చంద్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన క్యాబ్ డ్రైవర్ కల్యాణ్ చంద్ జాక్‌పాట్ కొట్టారు. ఇటీవల ఓ ప్రయాణికుడిని దింపేందుకు పంజాబ్‌లోని బఠిండాకు వెళ్లిన కల్యాణ్ చంద్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. పంజాబ్ రాష్ట్ర డియర్ సమ్మర్ స్పెషల్ బంపర్ లాటరీలో తొలి బహుమతిగా రూ.3 కోట్లను గెలుచుకున్నారు (Rs 3 Crore Lottery Winner).
ప్రయాణికుడిని దింపేందుకు బఠిండాకు వెళ్లిన కల్యాణ్ చంద్ అక్కడ రతన్ లాటరీ స్టాల్‌లో రూ.500 విలువైన రెండు లాటరీ టికెట్లు కొనుగోలు చేశారు (Lottery Jackpot Winner). వాటిల్లో ఒకదానికి రూ.3 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతడి జీవితం మారిపోయింది.
లాటరీ డబ్బుతో తన తండ్రి కలను నెరవేర్చుతానని కల్యాణ్ చంద్ తెలిపారు (Punjab Lottery winner). తమ గ్రామమైన సథానాలో ఉన్న పాత రెండు గదుల అతిథి గృహాన్ని మళ్లీ నిర్మిస్తానని చెప్పారు. ముగ్గురు పిల్లల విద్య, భవిష్యత్తు కోసం మిగిలిన డబ్బును ఖర్చు చేస్తానని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..
ట్రెండింగ్‌లో ఉన్న ఎంబీఏ స్పెషలైజేషన్లు