Share News

భూ వివాదం.. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడిపై దాడి..

ABN , Publish Date - Jun 22 , 2026 | 01:11 PM

బిహార్‌లో బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడు విజయేంద్రనాథ్ తివారీపై దాడి జరిగింది. ఓ భూ వివాదంలో ఆదివారం నాడు కొంతమంది వ్యక్తులు కర్రలతో ఆయనపై దాడి చేశారు.

భూ వివాదం.. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడిపై దాడి..
Actor Pankaj Tripathi

పాట్నా: బిహార్‌లో బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడు విజయేంద్రనాథ్ తివారీపై దాడి జరిగింది. ఓ భూ వివాదంలో ఆదివారం రాత్రి కొంతమంది వ్యక్తులు కర్రలతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. దీంతో నటుడి సోదరుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన పంకజ్ త్రిపాఠి స్వగ్రామమైన గోపాల్‌గంజ్ జిల్లా బెల్సంద్‌లో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన విజయేంద్రనాథ్‌ని బాధిత కుటుంబ సభ్యులు దాడి జరిగిన రోజు రాత్రే గోపాల్‌గంజ్ మోడల్ ఆస్పత్రికి తరలించారు.


అనంతరం మెరుగైన చికిత్స కోసం పాట్నాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని గోపాల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేయగా.. ఘటనపై స్పందించేందుకు నటుడి కుటుంబం నిరాకరించింది. కాగా, అరెస్టు చేసిన నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తున్నట్లు ఎస్పీ వినయ్ తివారీ తెలిపారు. బాధిత కుటుంబం ఇంకా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని ఆయన పేర్కొన్నారు. అధికారిక ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని గోపాల్‌గంజ్ ఎస్పీ వినయ్ తివారీ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

తమిళనాడులో భారీ విధ్వంసం.. ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు, సామగ్రి

ఫిలిప్పీన్స్‌లో దారుణం.. విద్యార్థులపై కాల్పులకు తెగబడిన తోటి విద్యార్థి..

Updated Date - Jun 22 , 2026 | 02:02 PM