ఐపీఎల్ 2026: పోరాడిన నమన్ ధీర్.. సీఎస్కే ముందు స్వల్ప లక్ష్యం
ABN , Publish Date - May 02 , 2026 | 09:32 PM
చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఎంఐ.. ఘోరంగా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. సీఎస్కేకి 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఎంఐ.. ఘోరంగా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. సీఎస్కేకి 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఎంఐ బ్యాటర్ నమన్ ధీర్(57) హాఫ్ సెంచరీ చేశాడు. అతడు మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. నమన్ ధీర్ పోరాడటం వల్లే ఎంఐ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.
విల్ జాక్స్(1), ర్యాన్ రికెల్టన్(37), సూర్యకుమార్ యాదవ్(21), తిలక్ వర్మ(5), హార్దిక్ పాండ్య(18), మింజ్(5) స్వల్ప పరుగులకే పెవిలియన్‌కు చేరారు. క్రిష్ భగత్(3*), బౌల్ట్(7*) నాటౌట్‌గా నిలిచారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 3, నూర్ అహ్మద్ 2, రామకృష్ణ ఘోష్ 1, ఓవర్టన్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026: భారత జట్టు ప్రకటన
కర్మన్‌ఘాట్ హనుమంతుడిని దర్శించుకున్న అభిషేక్ శర్మ